Mana ShankaraVaraprasad Garu: ప్రమోషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న అనిల్ రావిపూడి

Edited By:

Updated on: Nov 25, 2025 | 9:41 PM

అనిల్ రావిపూడి 'మన శంకరవరప్రసాద్ గారూ' సినిమా ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ నుంచే మేకింగ్ వీడియోలు, చిరంజీవి కామెడీని హైలైట్ చేస్తూ అదరగొడుతున్నారు. ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియోతో పాటు, పాత మెగాస్టార్ బ్లాక్‌బస్టర్ల డైలాగ్స్ ఇన్‌స్పిరేషన్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. సంక్రాంతి రిలీజ్ లక్ష్యంగా ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేస్తున్నారు.

కొన్ని సినిమాలకేమో షూట్ అయిపోతున్నా ప్రమోషన్ మొదలుపెట్టరు. కానీ కొన్ని అలా కాదు.. అనౌన్స్‌మెంట్ ముందు నుంచే ప్రమోషన్ షురూ అయిపోతుంది. అకేషన్ వచ్చిందటే.. అదిరిపోయే వీడియోలు అడక్కపోయినా వస్తుంటాయి. ఈ లిస్టులోకి వచ్చేదే మన శంకరవరప్రసాద్ గారూ. తాజాగా ఈ సినిమా నుంచి మరో మేకింగ్ వీడియో వచ్చేసింది. ఆ కథేంటో చూద్దామా..? అవును.. చిరంజీవి చెప్పినట్లు నిజంగానే అనిల్ రావిపూడి పిండేస్తున్నారు. అటు మెగాస్టార్‌లోని కామెడీని.. ఇటు ప్రమోషన్‌ను కలిపి పిండేస్తున్నారీయన. సగం సినిమా అయ్యాక గానీ ప్రమోషన్ గురించి ఆలోచించని డైరెక్టర్స్ ఉన్న ఈ రోజుల్లో.. ఓపెనింగ్ డే నుంచే మేకింగ్ వీడియోలు విడుదల చేస్తూ అదరగొడుతున్నారు అనిల్ రావిపూడి. అకేషన్ దొరికితే ఆడేసుకుంటారు అనిల్ రావిపూడి. పూజా చేసిన రోజే అనౌన్స్‌మెంట్ అంటూ రెండున్నర నిమిషాల వీడియోతో రప్ఫాడించిన అనిల్.. ఎప్పుడూ ప్రమోషన్‌కు రాని నయనతారతో కూడా వీడియో చేయించారు. ఇక మెగాస్టార్ బర్త్ డేకు ఖతర్నాక్ గ్లింప్స్ విడుదల చేసారు. అందులో రౌడీ అల్లుడు ట్యూన్‌తో ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చారు. ఇక మీసాల పిల్ల సంచలనం గురించి చెప్పనక్కర్లేదు. మన శంకరవరప్రసాద్ గారూ షూటింగ్ అప్పుడే చివరిదశకు వచ్చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో మేకింగ్ వీడియో వచ్చేసింది. నవంబర్ 23న అనిల్ రావిపూడి పుట్టిన రోజు సందర్భంగా సర్‌ప్రైజింగ్ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. ఇది చూస్తుంటే.. చిరంజీవి పాత సినిమాల నుంచి అనిల్ రావిపూడి బాగా ఇన్‌స్పైర్ అయ్యారని అర్థమవుతుంది. మెగాస్టార్ బ్లాక్‌బస్టర్ సినిమాల నుంచి అదిరిపోయే డైలాగ్స్ అన్నీ మన శంకరవరప్రసాద్‌ గారులో కనిపించబోతున్నాయి. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. ఇంకా 40 రోజులే టైమ్ ఉండటంతో.. ఈ లోపు ఎంత వీలైతే అంత ప్రమోషన్ చేయాలని చూస్తున్నారు అనిల్. మొత్తానికి ప్రమోషన్ విషయంలో తనను కొట్టేవాళ్లే లేరని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు ఈ హిట్ మిషన్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahavatar Narasimha: ఆస్కార్ బరిలో మహావతార్‌ నరసింహ

Keerthy Suresh: తన వీక్‌నెస్ ఏంటో బయటపెట్టిన కీర్తీ సురేష్‌

TOP 9 ET News: యూట్యూబ్‌పై అఖండ సర్జికల్ స్ట్రైక్.. బాలయ్యా.. మజాకా !!

6,6,6,6,6,6… సిక్సర్ల సునామీ.. 12 బంతుల్లో 50 రన్స్

పంట కాలువలో కొట్టుకుపోయిన కారు డ్రైవర్‌ ఏమయ్యాడంటే