Chiranjeevi: బాల్య మిత్రుడికి చిరంజీవి సపోర్ట్.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాల్య మిత్రుడికి సపోర్ట్‌గా నిలిచి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. మొగల్తూరుకు చెందిన పువ్వాడ రాజా అనే వ్యక్తి, చిరంజీవి... చిన్ననాటి స్నేహితులు. తన మిత్రుడి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్న చిరంజీవి చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఇటీవల చేర్పించారు.
టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాల్య మిత్రుడికి సపోర్ట్‌గా నిలిచి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. మొగల్తూరుకు చెందిన పువ్వాడ రాజా అనే వ్యక్తి, చిరంజీవి… చిన్ననాటి స్నేహితులు. తన మిత్రుడి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్న చిరంజీవి చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఇటీవల చేర్పించారు. తాజాగా ఆస్పత్రికి వెళ్లి వైద్యుల నుంచి రాజా ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ఫొటోను నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘మీరు గ్రేట్ సర్..’ అంటూ చిరంజీవిని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హమాస్ దగ్గర రసాయన ఆయుధాలు ఉన్నాయా ?? ఇజ్రాయిల్ వి ఆరోపణలా ?? నిజాలా ??
వైరల్ వీడియోలు
Latest Videos