Chiranjeevi: ‘అతడు నన్ను టార్గెట్ చేశాడు’ పోలీస్‌ స్టేషన్‌లో మెగాస్టార్ ఫిర్యాదు

Updated on: Oct 30, 2025 | 3:18 PM

మెగాస్టార్ చిరంజీవి మరోసారి పోలీసులను ఆశ్రయించారు. అక్టోబర్ 29న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో చిరు మరో ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో తనపై అభ్యంతకర పోస్టులు పెట్టి తిడుతున్న కొన్ని ఎక్స్ హ్యాండిల్ ప్రొఫైల్స్‌పై చిరంజీవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి కొంత మంది నెటిజన్లు మరింత వల్గర్ గా తనపై కామెంట్స్ చేస్తున్నారని తన ఫిర్యాదులో చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ నెటిజన్ల పై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ముఖ్యంగా దయా చౌదరి అనే వ్యక్తి తనను టార్గెట్ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాడని, అతనిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి తన ఫిర్యాదులో కోట్ చేశాడు. ఇక మెగాస్టార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. చాలా మంది సెలబ్రిటీల్లాగే మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్‌ ఫేక్‌ బారిన పడ్డారు. ఆయన మార్ఫింగ్ ఫొటో లు, వీడియోలు కొన్ని వెబ్ సైట్లలో కనిపించాయి. దీనిపై చిరంజీవి సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కోర్టును సైతం ఆశ్రయించారు. దీనిపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మెగాస్టార్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వాయిస్‌ను ఎవరూ ఉపయోగించకూడదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టీఆర్పీ, లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అయితే ఇప్పుడు మరోసారి చిరంజీవి పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Alia Bhatt: షూట్‌లో కాదు.. ఇంట్లో ఉన్నట్టే ఉంది అంటున్న అలియా

Sreleela: నన్ను చేసుకోబోయేవాడు అలానే ఉండాలి.. చెప్పిన శ్రీలీల

Krrish 4: క్రిష్‌ మూవీలో జాకీచాన్‌.. డీల్‌ ఓకేనా

‘అదో బుద్ధి లేని నిర్ణయం’.. పవన్ తో సినిమాను ఆలా ఎలా రిజెక్ట్ చేసాడు మావా

నిర్మాతలకు సీఎం రేవంత్ ఝలక్ టికెట్ రేట్లు పెంచాలంటే ఆ పని చేయాల్సిందే