Peddi: పెద్ది నుంచి వీడియో రిలీజ్ చేసిన టీమ్

Edited By: Phani CH

Updated on: Nov 29, 2025 | 1:13 PM

చికిరి చికిరి పాట మేకింగ్ వెనుక ఉన్న కష్టాన్ని, పుణె సవల్య ఘాట్ లొకేషన్ విశేషాలను తెలుసుకోండి. రోజుకు 45 నిమిషాలు ట్రెక్కింగ్ చేసి ఈ పాటను షూట్ చేశారు. అలాగే, రామ్ చరణ్ తదుపరి సినిమా సుకుమార్‌తో అల్ట్రా స్టైలిష్‌గా ఉండనుంది. ఇది రంగస్థలం సీక్వెల్ కాదని, మాస్ నుండి స్టైలిష్ లుక్ లో చెర్రీని చూడటానికి ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.

చికిరి చికిరి అంటూ ప్రపంచం అంతా స్టెప్పుల్ని రీక్రియేట్‌ చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ, చికిరి సాంగ్‌కి టీమ్‌ ఎంత కష్టపడిందో తెలుసా? ఆ లొకేషన్‌కి చేరుకోవడానికి ఎంత టైమ్‌ తీసుకున్నారో తెలుసా.. ఈ మూవీలో మాస్‌ గా కనిపిస్తున్న చెర్రీ, నెక్స్ట్ ఏం ప్లాన్‌ చేస్తున్నారో తెలుసా? చూసేద్దాం వచ్చేయండి.. చికిరి సాంగ్‌ చూసిన వాళ్లందరూ స్టెప్పులకి ఎంత ఫిదా అయ్యారో, ఆ మూవీ లొకేషన్‌ని కూడా అంతే ఇష్టపడ్డారు. ఆ విషయాన్ని గ్రహించిన టీమ్‌ ఏకంగా ఆ పాటను తెరకెక్కించడానికి ఎంత కష్టపడ్డామన్న విషయాన్ని వీడియోలో రిలీజ్‌ చేసేసింది. ప్రతి రోజూ 45 నిమిషాలు ట్రెక్కింగ్‌ చేసుకుని వెళ్లి మరీ ఆ పాటను షూట్‌ చేశారట. పుణెలో సవల్య ఘాట్‌లో ఈ సాంగ్‌ షూట్‌ చేశారు. స్పాట్‌కి చేరుకునే సమయంలో టీమ్‌ మాట్లాడుకున్న మాటలు కూడా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. విడుదలైన అన్ని భాషల్లో కలిపి వంద మిలియన్ల మార్క్ ఎప్పుడో దాటేసిందీ మూవీ. పెద్ది తర్వాత సుకుమార్‌ సెట్స్ కి వెళ్లడానికి ప్రిపేర్‌ అవుతారు రామ్‌ చరణ్‌. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అందరూ ఈ మూవీని రంగస్థలం సీక్వెల్‌ అనీ, రంగస్థలం ఛాయలుంటాయనీ అనుకున్నారు. కానీ, అందులో నిజం లేదంటోంది లేటెస్ట్ న్యూస్‌. బ్యాక్‌ టు బ్యాక్‌ రూరల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో పక్కా మాస్‌ సినిమాలు తీసిన సుకుమార్‌, నెక్స్ట్ అల్ట్రా స్టైలిష్‌ మూవీ చేయాలనుకుంటున్నారట. అందులో భాగంగా చెర్రీ స్క్రిప్ట్ ని డిజైన్‌ చేస్తున్నారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ మెగాపవర్‌స్టార్‌ని సుకుమార్‌ లెన్స్ లో స్టైలిష్‌ లుక్‌లో చూడబోతున్నందుకు ఎగ్జయిటింగ్‌గా ఉందంటున్నారు ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర

దోమలను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ??

ఈ పొరపాట్లు చేస్తున్నారా ?? ఫ్లైట్‌ మిస్‌ అవుతుంది జాగ్రత్త !!

Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ

పెరుగుతున్న డయాబెటిస్‌ కేసులు.. స్కిన్‌ క్రీమ్‌ రూపంలో ఇన్సులిన్‌