Barkha Madan: అప్పుడు హాట్ హీరోయిన్.. ఇప్పుడు సన్యాసి! దేశముదురు సినిమాలా ఉంది ఈమె కథ

|

Feb 08, 2024 | 10:44 AM

సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అప్పట్లో ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ వంటి స్టార్లతో పోటీపడింది. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని కొద్దిలో టైటిల్ చేజార్చుకుంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం వరుస అవకాశాలను అందుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంది.

సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అప్పట్లో ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ వంటి స్టార్లతో పోటీపడింది. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని కొద్దిలో టైటిల్ చేజార్చుకుంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం వరుస అవకాశాలను అందుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంది. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి బౌద్ధ సన్యాసిగా మారింది. ఆమె ఇన్ స్టాలోనూ అన్ని ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా ? తనే బర్ఖా మదన్.

ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. మోడల్. 1994లో మిస్ ఇండియా ఫైనలిస్ట్. అందాల కిరీటం కోసం సుస్మితా సేన్, ఐశ్వర్యా రాయ్ లతో పోటీ పడి మొదటి రన్నరప్ గా నిలిచారు. ఆ తర్వాత మిస్ టూరిజం వరల్డ్ వైడ్ రన్నరప్ గా నిలిచారు. మలేషియాలో మిస్ టూరిజం ఇంటర్నేషనల్‌లో మూడవ రన్నరప్‌గా నిలిచింది. 1996లో ‘ఖిలాడీ కా ఖిలాడీ’ సినిమాతో కథానాయికగా బాలీవుడ్ అరంగేట్రం చేసింది. 2003లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘భూత్’ సినిమాలోనూ నటించింది. ఓవైపు సినిమాలు.. మరోవైపు సీరియల్లలోనూ నటిస్తూ.. బిజీ లైఫ్ లీడ్ చేసిన ఈ హీరోయిన్ ఆ వరువాత ప్రొడ్యూసర్‌గానూ అవతారం ఎత్తింది.

అలా ప్రొడ్యూసర్‌గా మారి.. ఓ రెండు సినిమాలు చేసిందో లేదో.. ఆ తర్వాత ఉన్నట్లుండి సన్యాసిగా మారిపోవాలని డిసైడైంది. బౌద్ధ మతాన్ని స్వీకరించింది. ఆతర్వాత ‘గ్యాల్టెన్ సామ్టెన్’ గా తన పేరును మార్చుకుంది. ప్రస్తుతం ఆమె పర్వతాలు, ఆశ్రమాలలలో తిరుగుతూ కనిపిస్తోంది. అయితే ఈమె స్టోరీ తెలిసిన కొంత మంది నెటిజన్లు… దేశముదురు సినిమాలోని హీరోయిన్ హన్సికతో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడు హాట్ బ్యూటీ… ఇప్పుడు సన్యాసి అంటూ మీమ్స్‌ వైరల్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..