Balayya – Pawan: మూడు పెళ్లిల్లు ఎందుకు.? పవన్‌కు బాలయ్య సూటి ప్రశ్న..వీడియో.
అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ నుంచి.. షోకు వచ్చిన గెస్టులందర్నీ కాస్త బోల్డ్‌గా.. డేరింగ్‌గా.. ఇరుకున పెట్టేలా ప్రశ్నలడిగి సమాధానాలు రాబడుతున్న బాలయ్య.. తాజాగా జరిగిన పవన్ ఎపిసోడ్ లో కూడా అదే చేశారట.
అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ నుంచి.. షోకు వచ్చిన గెస్టులందర్నీ కాస్త బోల్డ్‌గా.. డేరింగ్‌గా.. ఇరుకున పెట్టేలా ప్రశ్నలడిగి సమాధానాలు రాబడుతున్న బాలయ్య.. తాజాగా జరిగిన పవన్ ఎపిసోడ్ లో కూడా అదే చేశారట. రాజకీయంగా.. సామాజికంగా.. చాలా ప్రశ్నలు అడిగి.. పవన్ నుంచి సమాధానాలు రాబట్టారట. ఇంటి విషయాలు.. ఇంట్లో విషయాలను కూడా టచ్ చేసి.. పవన్ మనోగతం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారట. సినిమాలు… సన్నిహితుల గురించి అడిగి.. పవన్‌ను పూర్తితగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారట బాలయ్య. ఇక ఈ కమ్రంలోనే తన మూడు పెళ్లిల్ల పై కూడా పవన్ ను సూటిగా ప్రశ్నించారట బాలయ్య.ఎస్ ! సినిమాల్లో కాని.. వ్యక్తిత్వంలో కాని వీసుమెత్తు మచ్చ లేకుండా ఉన్న పవన్ కళ్యాణ్.. ఒక్క.. పెళ్లిల్ల వ్యవహారంతోనే తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. రాజకీయంగా ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నారు. అప్పుడప్పుడూ.. అపోజిషన్ నాయకులు సంధిస్తున్న విమర్శలకు కాస్త గట్టిగానే సమాధానం చెబుతున్నా.. ఎందుకనో ఈ విషయంలో మాత్రం కాస్త మెతకగానే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. తాజాగా ఇదే ప్రశ్నను సంధించారట బాలయ్య. అన్‌స్టాపబుల్ వేదికపై నుంచి నీ మూడు పెళ్లిల్ల కథేంటి.. వస్తున్న విమర్శలపై నీ రియాక్షన్ ఏంటని అడిగారట.ఇక బాలయ్య అడిగిన ప్రశ్నలకు చాలా ఓపిక గా సమాధానం చెప్పిన పవన్.. తన సమాధానంతో.. బాలయ్య తో షోలో ఉన్న ఆడియెన్స్ మనసు కూడా గెలుచుకున్నారట. అంతేకాదు “ఇంకొక సారి పవన్ పెళ్లి గురించి ఎత్తితే మీరు ఊరకుక్కలతో సమానం” అని అపోజిషన్ నాయకులకు బాలయ్య వార్నింగ్ ఇచ్చేలా చేసుకున్నారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..