రూ.100 కోట్లు కొల్లగొట్టిన డాకు.. బాలయ్యే కింగ్ ఆఫ్ సంక్రాంతి..
నందమూరి నటసింహం బాలకృష్ణ 'డాకు మహారాజ్'తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా భారీ విజయం దక్కించుకుంది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో వసూళ్లు అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు మరో మైలురాయి చేరుకుంది. ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్ దాటినట్లు మేకర్స్ వెల్లడించారు.
రిలీజైన 4 రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో వసూళ్లు రావడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘కింగ్ ఆఫ్ సంక్రాంతి’ అంటూ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీని రేపు తమిళంలోనూ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘సంక్రాంతి బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్ 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.105 కోట్లు వసూల్ చేసింది’ అంటూ మేకర్స్ ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ రూ.105 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక ‘డాకు మహారాజ్’కు మొదటి రోజైన ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.56 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దా*డి.. 6 చోట్ల క*త్తిపోట్లు
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్
TOP 9 ET News: వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్ | కలెక్షన్స్ కుమ్మడంలో ‘డాకు’ నెం1
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో.. ఇలా!
అవాక్కయ్యేలా చేసిన జానీ మాస్టర్ కొడుకు.. గేమ్ ఛేంజర్ గురించి భలేగా మాట్లాడాడు