Bhagwant Kesari: ఓ ఆడపిల్లా.. జర భద్రం.! భగవంత్‌ కేసరి చెప్పిన ‘బ్యాడ్‌ టచ్‌’ పాఠానికి సర్వత్రా ప్రశంసలు.

Bhagwant Kesari: ఓ ఆడపిల్లా.. జర భద్రం.! భగవంత్‌ కేసరి చెప్పిన ‘బ్యాడ్‌ టచ్‌’ పాఠానికి సర్వత్రా ప్రశంసలు.

Anil kumar poka

|

Updated on: Oct 22, 2023 | 8:56 PM

భగవంత్‌ కేసరి సినిమాలో ‘బ్యాడ్‌ టచ్‌’ పాఠం పిల్లలందరికీ వివరంగా చెప్పి అగ్ర నటుడు బాలకృష్ణ , దర్శకుడు అనిల్‌ రావిపూడి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సాధారణంగా ఏం జరుగుతుందంటే.. తమ చిట్టి చేతులను పట్టి నలుపుతుంటే... ఎందుకో తెలియక బిత్తర చూపులు చూస్తారే తప్ప ఆ చేతులను విడిపించుకోని పారిపోవాలన్న తెలివి పిల్లలకి ఉండదు. చెంపలను తడుముతుంటే... ముద్దు చేస్తున్నారనుకుంటారు కానీ,

భగవంత్‌ కేసరి సినిమాలో ‘బ్యాడ్‌ టచ్‌’ పాఠం పిల్లలందరికీ వివరంగా చెప్పి అగ్ర నటుడు బాలకృష్ణ , దర్శకుడు అనిల్‌ రావిపూడి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సాధారణంగా ఏం జరుగుతుందంటే.. తమ చిట్టి చేతులను పట్టి నలుపుతుంటే… ఎందుకో తెలియక బిత్తర చూపులు చూస్తారే తప్ప ఆ చేతులను విడిపించుకోని పారిపోవాలన్న తెలివి పిల్లలకి ఉండదు. చెంపలను తడుముతుంటే… ముద్దు చేస్తున్నారనుకుంటారు కానీ, ఎదుటి వారి మనుసులోని రాక్షస కోరికను అర్థం చేసుకోలేరు. ఓ చాక్లెట్లో, బిస్కెట్లో చేతుల్లో పెట్టి, దగ్గరకు తీసుకుంటే ప్రేమనుకుంటారు కానీ తమని కాటేసే కర్కశత్వం అని గ్రహించలేరు. తల్లిదండ్రులే పిల్లలకి ఈ విషయంలో కొంత నాలెడ్జ్ ను అందించాలి. స్పర్శల్లో తేడాలను చెప్పాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే రెండు ఉంటాయని, వాటిల్లో బ్యాడ్ టచ్ లక్షణాలు ఇవని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇది ఒక్కరోజులో వాళ్లు అర్థం చేసుకోకపోవచ్చు కానీ రోజూ వివరిస్తుంటే వారికి కచ్చితంగా అర్థమవుతుంది. ఆడపిల్లలపైనే కాదు, మగపిల్లలపైనా కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. కనుక ఇద్దరికీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలియాల్సిందే.

సినిమాలో నేలకొండ భగవంత్‌ కేసరి పాప స్కూల్‌కు వెళతాడు. అక్కడి టీచర్లు ఏనాడూ చెప్పని ‘బ్యాడ్‌ టచ్‌’ పాఠం పిల్లలందరికీ వివరంగా చెబుతాడు. అంటే సినిమాకొచ్చిన ప్రతి ఒక్క తల్లికీ, తండ్రికీ, చిన్నారికీ చెప్పాడన్నమాట. అతను ఏం చెప్పాడంటే – ఆటో డ్రైవరు, స్కూల్లో ప్యూను, పక్కింటి అంకుల్, ఆఖరికి ఇంట్లో తాతయ్య, అన్నయ్య అయినా సరే.. వేయరాని చోట చేయి వేస్తే వెంటనే పరిగెత్తుకెళ్లి అమ్మకు చెప్పమని.. అమ్మనే మిమ్మల్ని కాపాడుకుంటుందని అమ్మలకూ ఓ మాట చెప్పాడు. అడవిలో క్రూరమృగాలు తిరుగుతుంటాయి అని బోర్డు ఉంటుంది. కానీ ఈ సమాజంలో మాత్రం మానవ మృగాల నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎలాంటి సూచికలూ ఉండవు. కాబట్టి అమ్మలే తమ బిడ్డలకు ఆ జాగ్రత్తలు చెప్పాలని అంటాడు. ఓ కమర్షియల్‌ సినిమాలో, అందులోనూ ఓ అగ్ర హీరో సినిమాలో ఈ అంశంపై అవగాహన పెంచడం నిజంగా అభినందనీయం అని, దీని ద్వారా ఓ అవసరమైన మార్పునకు నాంది పలికారని దర్శకుడు అనిల్‌ రావిపూడిని కొనియాడుతున్నారు నెటిజన్లు. మెయిన్ స్టీమ్ సినిమాల ద్వారా ఇలాంటి అంశాలు చర్చిస్తే ఎక్కువ మందికి చేరే అవకాశముంటుందని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..