Bahubali: బాహుబలి ఎపిక్.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. మరల బాక్సాఫీస్ బద్దలే
బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అందులో నిజమెంతో తెలియదు కానీ ఏ మాత్రం నిజం ఉన్నా రాజమౌళి తెలివి తేటలకు దండం పెట్టాల్సిందే. అసలు రీ రిలీజ్ సినిమాలకు కలెక్షన్లు రావడమే కష్టం అనుకుంటే.. ఏకంగా రికార్డు బిజినెస్ చేస్తుంది బాహుబలి. మరి ఆ ముచ్చట్లేంటో చూద్దామా..? రీ రిలీజ్ సినిమాలలో కూడా రికార్డులు క్రియేట్ చేయాలని చూస్తున్నారు రాజమౌళి.
అప్పట్లో బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమాను మార్చేసిన జక్కన్న.. ఇప్పుడు అదే సినిమా రీ రిలీజ్‌తో మరో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టేలా కనిపిస్తున్నారు. అక్టోబర్ 31న బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ కానుంది.. దీన్ని స్ట్రెయిట్ సినిమా స్థాయిలోనే విడుదల చేస్తున్నారు. బాహుబలి ఎపిక్ కోసం SSMB29 పనులు కూడా కొన్నాళ్లు పక్కనబెట్టారు రాజమౌళి. ఈ ఎడిట్ కోసం చాలా టైమ్ తీసుకున్నారు. కొత్త సినిమా స్థాయిలోనే ప్రమోట్ చేయడం కాదు.. బిజినెస్ పరంగానూ బాహుబలి ఎపిక్ కొత్త రికార్డులకు తెరతీసేలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలకు కొంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. బాహుబలి: ది ఎపిక్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. నైజాం 17 కోట్లు, సీడెడ్ 4.5 కోట్లు, ఆంధ్రా 15 కోట్లు.. మొత్తంగా తెలుగు రాష్ట్రాల రైట్స్ 36.5 కోట్లకు కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ రీ రిలీజ్ సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరగడం సంచలనమే. ఈ బిజినెస్ నిజమా లేదంటే హైప్ కోసం చేసారా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది. ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం.. రీ రిలీజ్ సినిమాను సైతం స్ట్రెయిట్ రేంజ్‌లో విడుదల చేయడం.. దాని గురించి మాట్లాడేలా చేయడం మాత్రం కేవలం రాజమౌళికే సాధ్యం. పైగా దీనికోసం సపరేట్ ఇంటర్వ్యూలు చేసారు.. అవి త్వరలోనే రానున్నాయి. అవొచ్చాక రేంజ్ ఇంకాస్త పెరగనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శబరిమల మార్గంలో విరిగిపడ్డ కొండ చరియలు
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ బహిరంగ లేఖ
తోకలపూడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో చిల్లర దొంగ చేతివాటం