Allu Arjun: అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..

|

Dec 19, 2024 | 9:26 AM

డిసెంబర్ 05న విడుదలైన పుష్ప 2 సినిమా ఇప్పటికే రూ. 1300 కోట్ల కలెక్షన్లకు చేరువలో ఉంది. బాలీవుడ్ లోనూ ఈ సినిమా ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మార్మోగిపోతోంది. అయితే ఇంతలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీ అరెస్ట్ కావడం మరింత సంచలనమైంది. దీంతో ఐకాన్ స్టార్ పేరు మరోసారి ట్రెండ్ అయ్యింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ లాంటి కేంద్ర మంత్రులు సైతం అల్లు అర్జున్ అరెస్టును తప్పు పట్టారు.

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలోనే బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడని, కొత్త పార్టీ స్థాపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా త్వరలోనే బన్నీ పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాడని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జైలుకి వెళ్లిన వారంతా సీఎంలు అవుతున్నారు. అలా అల్లు అర్జున్ కూడా త్వరలోనే కచ్చితంగా సీఎం అయ్యే చాన్స్ ఉంది. 100 శాతం ఆయన కచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతాడు’ అంటూ గట్టిగా చెప్పాడు వేణు స్వామి.

అయితే ఇందుకు సంబంధించిన వేణు స్వామి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై బన్నీ అభిమానులు, నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్లు వస్తున్నాయి. కొందరు వేణుస్వామి మాటలను స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈయన మాటలు పక్కుకు పెడితే.. ఇదివరకే అల్లు అర్జున్ టీమ్ ఈ పొలిటికల్ రూమర్లను ఖండించింది. ఇదే విషయం చెబుతూ కొద్ది రోజుల క్రితమే ట్వీట్ చేసింది అల్లు అర్జున్ టీమ్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.