ఎట్టకేలకు ఓటీటీలోకి ‘షీనా బొరా’ హత్య కేసు డాక్యుమెంటరీ

|

Mar 04, 2024 | 4:14 PM

2015లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంట‌రీ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్‌ ట్రూత్‌’ . ఈ డాక్యుమెంట‌రీని ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. అయితే డాక్యుమెంటరీ ప్రసారం కాకుండా నిలిపివేయాల‌ని స్పెషల్‌ కోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. ఈ డాక్యుమెంటరీలో షీనా బోరా కేసులో నిందితులుగా ఉన్న వాళ్లు, నిందితులతో సంబంధం ఉన్న వాళ్లు నటించారని..

2015లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంట‌రీ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్‌ ట్రూత్‌’ . ఈ డాక్యుమెంట‌రీని ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. అయితే డాక్యుమెంటరీ ప్రసారం కాకుండా నిలిపివేయాల‌ని స్పెషల్‌ కోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. ఈ డాక్యుమెంటరీలో షీనా బోరా కేసులో నిందితులుగా ఉన్న వాళ్లు, నిందితులతో సంబంధం ఉన్న వాళ్లు నటించారని, కాబట్టి ఆ డాక్యుమెంటరీ ప్రసారం కాకుండా అడ్డుకోవాలని పిటిషన్‌లో పేర్కొంది. అయితే ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాకుండా నిలపాలని అభ్యర్థిస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. డాక్యుమెంటరీ ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశించే అధికారం తమకు లేదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే దర్యాప్తు సంస్థతోపాటు న్యాయస్థానం వీక్షించేందుకు ముందస్తుగా ప్రదర్శించాలని సదరు ఓటీటీ సంస్థను కోర్టు ఆదేశించింది. ఇక ఈ డాక్యుమెంట‌రీపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఈ డాక్యుమెంట‌రీని స్ట్రీమింగ్‌లోకి తీసుకువ‌చ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారమవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.50 కోట్ల లగ్జరీ కార్లు.. లెక్కకు మించిన ఆస్తులు

జైలు నుంచి బయటకు వచ్చాడు..మళ్లీ అదే పని చేస్తూ

Follow us on