AR Rahman: ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.

|

Nov 25, 2024 | 10:00 AM

తనపై దుష్ప్రచారం చేసిన సోషల్ మీడియా, ప్రధాన మీడియా సంస్థలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బిగ్ షాక్ ఇచ్చారు. తన విడాకులపై, తన కుటుంబంపై అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేసేలా ఉన్న వార్తలు, సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు డిలీట్ చేయాలని రెహమాన్ డిమాండ్ చేశారు.

తనపై జరిగిన దుష్ప్రచారానికి సంబంధించిన కంటెంట్ ఏ రూపంలో ఉన్నా 24 గంటల్లోగా ఆ మొత్తం తొలగించకపోతే భారతీయ న్యాయ సంహితలోని 356 సెక్షన్ కింద పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిస్తూ ఏఆర్ రెహమాన్ తరపు న్యాయవాది బహిరంగ నోటీసులు విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ ఆయన భార్య సైరా బాను పరస్పర అంగీకారంతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని తొలుత సైరా బాను తరపు న్యాయవాది వందనా షా మీడియాకు వెల్లడించగా, తర్వాత రెహమాన్ సైతం విడాకులపై ప్రకటన చేశారు. తమ జీవితంలో ఇది టఫ్ ఫేజ్ అని వారి ప్రకటనలో ఇద్దరూ పేర్కొన్నారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు తెలియాలని విడాకుల నిర్ణయం అధికారికంగా ప్రకటించామన్నారు. ఎంతో బాధతో తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని చెప్పినా. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. తన క్లయింట్‌కు సంబంధించి యూట్యూబ్, ట్విట్టర్ , ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ఇతర ఆన్ లైన్ సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో చేసిన అసత్యప్రచారానికి సంబంధించి మొత్తం కంటెంట్ తొలగించాలని న్యాయవాది నర్మదా సంపత్ నోటీసులో పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.