తండేల్ రాజ్ కు చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్
లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మరోసారి కలిశారు. వీరిద్దరు జంటగా నటించిన రెండో చిత్రం తండేల్. కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించాడు. బన్నీ వాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
ఇప్పటికే అన్ని హంగులు, కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తండేల్ ఫిబ్రవరి 07న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా హైదరాబాద్ లోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. తాజాగా తండేల్ టీమ్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిత్ర బృందం చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని తండేల్ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలోని అన్ని సింగిల్ స్క్రీన్స్ లో జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్స్ లో జీఎస్టీతో కలిపి రూ.75 పెంచుకునేలా ఆదేశాలిచ్చింది. సినిమా విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు ఈ అదనపు ధరలు అమలులో ఉండనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం (ఫిబ్రవరి 05) అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహా కుంభమేళాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్..
ఎట్టకేలకు ‘టాక్సిక్’ సెట్‌లోకి స్టార్ హీరోయిన్..
కాఫీ చేదుగా ఉండడం వెనుక అసలు కారణం ఇదే!
సామాన్యుల కోసం లగ్జరీ రైళ్లు..మారిన కాజీపేట స్టేషన్ రూపురేఖలు
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

