మహా కుంభమేళాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్..
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఇక్కడకు వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన నటీ నటులు పెద్ద ఎత్తున కుంభ మేళాకు వెళుతున్నారు. అనంతరం అక్కడి అనుభవాలను సోషల్ మీడియ వేదికగా అందరితో పంచుకుంటున్నారు.
తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సంయుక్త మీనన్ మహా కుంభమేళాను దర్శించుకుంది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసింది. అనంతరం ఇందుకు సంబంధించి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘జీవితంలో విశాలతను మనం కళ్లారా చూసినప్పుడు దానికి మించింది మరొకటి లేదు అనిపిస్తుంది. అనంతమైన స్ఫూర్తి కోసం నా సంస్కృతిని నేను ఎంతో ఆదరిస్తాను. మహా కుంభ మేళాలో భాగంగా గంగా నదిలో పవిత్రమైన స్నానం చేస్తున్నప్పుడు నా మనసు మరింత తేలికపడింది’ అని తన ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎట్టకేలకు ‘టాక్సిక్’ సెట్‌లోకి స్టార్ హీరోయిన్..
కాఫీ చేదుగా ఉండడం వెనుక అసలు కారణం ఇదే!
సామాన్యుల కోసం లగ్జరీ రైళ్లు..మారిన కాజీపేట స్టేషన్ రూపురేఖలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

