Pushpa 2: రికార్డుల రారాజుగా పుష్పరాజ్.. తగ్గేదేలే

|

Dec 04, 2024 | 3:45 PM

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 12వేల స్క్రీన్స్‌లో పుష్ప 2 రిలీజ్ అవుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదో రికార్డ్. ఇండియాలో మొత్తం 9500 స్క్రీన్స్ ఉన్నాయని అంచనా. అందులో 6500 నుంచి 7 వేల స్క్రీన్స్‌లో కేవలం పుష్ప 2 మాత్రమే విడుదల చేస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా మరో 5500 స్క్రీన్స్‌లో పుష్ప రిలీజ్ చేస్తున్నారన్నది టాక్.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 లక్షల స్క్రీన్స్‌ ఉండగా.. అందులో దాదాపు 12 వేలకు పైగా స్క్రీన్స్‌లో పుష్ప 2 మాత్రమే ప్రదర్శించనున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్క్రీన్లలో 12 శాతం స్క్రీన్స్ బన్నీకి మాత్రమే పరిమితం. ఇది పుష్ప 2 క్రియేట్ చేసిన మరో రికార్డ్. ఇక ప్రీ బుకింగ్.. ఈ విషయానికొస్తే.. ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ తుడిచి పెట్టేసింది పుష్ప 2. అన్ని భాషల్లో కలిపి జస్ట్ ఓపెనింగ్ డేనే ఏకంగా 50 కోట్ల ప్రీ బుకింగ్ బిజినెస్ చేసింది. ఇది జస్ట్ డిసెంబర్ 3 ఉదయం 10 గంటల వరకు జరిగిన బుకింగ్స్ రేంజ్ మాత్రమే. రిలీజ్ డే నాటికి 100 కోట్లకు దాటుతుందని అంచనా. కేవలం డే వన్‌లోనే మొత్తం 10 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్స్ ఇండియాలోనే 200 కోట్లు దాటుతాయని, వరల్డ్ వైడ్ 300 కోట్లు దాటే అవకాశం ఉందన్నది సినీ క్రిటిక్స్ అంచనా. ఈ దెబ్బకు బాహుబలి,కేజీఎఫ్, కల్కి.. ఈ సినిమాల రికార్డలన్నీ చెల్లా చెదురైపోయాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

వాట్సాప్‌లో ఒకేసారి 256 మందికి మెసేజ్ ఎలా పంపాలో తెలుసా ??

మ్యాచ్‌ ఆడేందుకు ఓపెనర్‌గా దిగాడు.. క్షణాల్లో కుప్పకూలిపోయాడు !!

12 అడుగుల పాము.. చూస్తేనే హడల్

ట్రైన్లలో దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు ??