Allu Arha – Allu Ayaan: చిట్టి చిట్టి చేతులతో.. కేక్ చేసిన ఐకాన్ స్టార్ కూతురు , కొడుకు.. వీడియో.

|

Dec 28, 2023 | 10:21 AM

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ గ్రాండ్‏గా జరిగాయి. సామాన్యుల నుంచి స్టార్స్ వరకు ఫ్యామిలీతో కలిసి పండగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సినీతారలు క్రిస్మస్ పండగను ఓ వేడుకల జరుపుకున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీస్ కలిసి క్రిస్మస్ పార్టీ ఏర్పాటు చేయగా.. ఇందులో మెగా కజిన్స్ అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. ముఖ్యంగా ఎప్పుడో ఒకసారి కనిపించే అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ పార్టీలో కనిపించిన సంగతి తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ గ్రాండ్‏గా జరిగాయి. సామాన్యుల నుంచి స్టార్స్ వరకు ఫ్యామిలీతో కలిసి పండగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సినీతారలు క్రిస్మస్ పండగను ఓ వేడుకల జరుపుకున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీస్ కలిసి క్రిస్మస్ పార్టీ ఏర్పాటు చేయగా.. ఇందులో మెగా కజిన్స్ అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. ముఖ్యంగా ఎప్పుడో ఒకసారి కనిపించే అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ పార్టీలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే ఇప్పుడు ఓ స్పెషల్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అది మరెవరిదో కాదు.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ, కుమారుడు అల్లు అయాన్ వీడియో. వీరిద్దరూ తమ తల్లితో కలిసి కిచెన్‏లో సందడి చేసిన వీడియో… క్రిస్మస్ పండగ సందర్భంగా కేక్ తయారు చేసిన వీడియో..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హ చేసే అల్లరి గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరికి సంబంధించిన ఫన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. బన్నీతో కలిసి అర్హ చేసే అల్లరి గురించి తెలిసిందే. ఇక అయాన్ ఫోటోస్, వీడియోస్ సైతం నిత్యం చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా క్రిస్మస్ సందర్భంగా వీరిద్దరూ తమ తల్లి స్నేహారెడ్డితో కలిసి కిచెన్‏లో క్రిస్మస్ కేక్ రెడీ చేశారు. చాక్లెట్ కేక్ ఎలా రెడీ చేయాలో చెబుతూ.. పిల్లల చేత కేక్ రెడీ చేయించింది స్నేహా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇందులో అయాన్ ఎక్కువగా ఇంగ్లీష్‏లోనే మాట్లాడుతుండగా..అర్హ తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ కనిపించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.