Krithi Shetty: మడికట్టుకుని కూర్చుంటే అవకాశాలొస్తాయా.? కృతి పై నెటిజన్స్ కామెంట్స్..

|

Dec 21, 2023 | 8:48 PM

‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలా టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన కృతిశెట్టి.. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో బిజీబిజీగా ఉంది. అక్కడ వరుసగా మూడు సినిమాల్లో నటిస్తోంది ఈ బెంగళూరు భామ. కార్తీక్‌కి జోడీగా ‘వా వాతియారే’లో నటిస్తున్న ఈ భామ .. ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌'ఎల్‌ఐసీలో ప్రదీప్‌ రంగనాథన్‌తో జతకడుతోంది. వీటితోపాటు ‘జెనీ’లో జయం రవికి జంటగా నటిస్తుంది. ఈ మూడు సినిమాలూ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ఇక తెలుగులో ఓ సినిమా, మలయాళంలో ఓ సినిమా చేస్తూ.. మొత్తానికి సౌత్‌లోని దాదాపు అన్ని భాషలను కవర్‌ చేస్తుంది కృతిశెట్టి.

‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలా టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన కృతిశెట్టి.. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో బిజీబిజీగా ఉంది. అక్కడ వరుసగా మూడు సినిమాల్లో నటిస్తోంది ఈ బెంగళూరు భామ. కార్తీక్‌కి జోడీగా ‘వా వాతియారే’లో నటిస్తున్న ఈ భామ .. ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌’ఎల్‌ఐసీలో ప్రదీప్‌ రంగనాథన్‌తో జతకడుతోంది. వీటితోపాటు ‘జెనీ’లో జయం రవికి జంటగా నటిస్తుంది. ఈ మూడు సినిమాలూ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ఇక తెలుగులో ఓ సినిమా, మలయాళంలో ఓ సినిమా చేస్తూ.. మొత్తానికి సౌత్‌లోని దాదాపు అన్ని భాషలను కవర్‌ చేస్తుంది కృతిశెట్టి. తమిళ సినిమాపై ఎక్కువ దృష్టిపెట్టడానికి కారణం పై ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది కృతిశెట్టి. పర్టిక్యులర్‌గా తమిళ సినిమాపైనే దృష్టి పెట్టాను అనడం తప్పనీ .. కథలు వినే క్రమంలో నచ్చిన కథలకు సైన్‌ చేస్తున్నాననీ చెప్పుకొచ్చింది. తాను నటిని అని నటనకు భాషలతో పనేముందని ప్రశ్నించింది. తాను కన్నడ అమ్మాయే అయినా తెలుగులో బ్రేక్‌ వచ్చిందనీ ఒకే భాషలో చేస్తానని మడికట్టుకొని కూర్చుంటే ఇదంతా జరిగేదా అంది. కేరక్టర్ల గురించి తెలుసుకోవడం నచ్చిన పాత్రలను భాషలతో నిమిత్తం లేకుండా చేసుకుంటూ పోవడం ఇదే తన పని అంటూ చెప్పుకొచ్చింది కృతి శెట్టి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Dec 21, 2023 08:35 PM