Sriya Reddy - Salaar: ప్రభాస్‌ సినిమాకు శ్రియా రెడ్డి కండీషన్స్.. నవ్వుకున్న డైరెక్టర్‌ ప్రశాంత్..

Sriya Reddy – Salaar: ప్రభాస్‌ సినిమాకు శ్రియా రెడ్డి కండీషన్స్.. నవ్వుకున్న డైరెక్టర్‌ ప్రశాంత్..

Anil kumar poka

|

Updated on: Dec 31, 2023 | 8:45 AM

ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డిసెంబర్‌ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. ఖన్సార్‌ ప్రపంచంలో ప్రశాంత్‌ నీల్‌ సృష్టించిన సరికొత్త ప్రపంచం, సినిమాలోని డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. సలార్‌ సినిమాతో చాలా రోజుల తర్వాత వెండి తెరపై దర్శనమిచ్చింది శ్రియా రెడ్డి. రాధా రామ మన్నార్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించింది. ముఖ్యంగా హీరోతో సమానంగా ఈ పాత్రకు స్పేస్‌ ఇచ్చారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.

ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డిసెంబర్‌ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. ఖన్సార్‌ ప్రపంచంలో ప్రశాంత్‌ నీల్‌ సృష్టించిన సరికొత్త ప్రపంచం, సినిమాలోని డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. సలార్‌ సినిమాతో చాలా రోజుల తర్వాత వెండి తెరపై దర్శనమిచ్చింది శ్రియా రెడ్డి. రాధా రామ మన్నార్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించింది. ముఖ్యంగా హీరోతో సమానంగా ఈ పాత్రకు స్పేస్‌ ఇచ్చారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. అందుకు తగ్గట్టుగానే తన అద్భుతమైన నటన, లుక్‌, బాడీ లాంగ్వేజ్‌తో రాధా రమ పాత్రకు ప్రాణం పోసింది శ్రియా రెడ్డి. అయితే సలార్‌ సినిమాలో నటించే ముందే ప్రశాంత్ నీల్‌కు ఒక సీరియస్ కండిషన్‌ పెట్టిందట శ్రియా రెడ్డి. “నేను మీ సినిమాలో నటించాలంటే హీరోతో సమానంగా నా పాత్రకు ప్రాధాన్యమివ్వాలి. కథానాయకుడిలా పవర్ ఫుల్ గా ఉండే రోల్ నాకూ ఉండాలి, లేకపోతే నేను నటించే ప్రసక్తి లేదు” అని కండీషన్‌ పెట్టిందిట శ్రియా రెడ్డి. ఇక ఈమె ఈ కండీషన్ విన్న ప్రశాంత్ నీల్ మొదట నవ్వారట. ఎందుకు నవ్వుతున్నావు శ్రియా రెడ్డి అడిగితే.. నేను నీకు ఆఫర్ చేసే క్యారెక్టర్ సరిగ్గా ఇలాగే ఉండాలనుకున్నా.. నువ్వు కూడా ఇదే అడిగే సరికి నవ్వుకున్నా అంటూ.. ఆన్సర్ ఇచ్చారట ప్రశాంత్ నీల్. అయితే ఈ విషయాన్ని శ్రియా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో.. ఇప్పుడీమ మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Dec 31, 2023 08:28 AM