చడీచప్పుడు కాకుండా ప్రియుడితో ఎంగేజ్‌మెంట్.. షాకిచ్చిన హీరోయిన్

Updated on: Aug 29, 2025 | 1:59 PM

నివేథా పేతురాజ్! దుబాయ్‌ నుంచి ఇంపోర్ట్ అయిన ఈ బ్యూటీ.. సౌత్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాగా వేయాలనుకుంది. కష్టపడి మరీ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. ఓ వైపు గ్లామర్‌ పాత్రలతో.. మరో వైపు యాక్టింగ్ ఓరియెంటెడ్‌ రోల్స్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కానీ సూపర్ స్టార్ రేంజ్‌కు వెళ్లలేకపోయింది. ఈ క్రమంలోనే ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకుని.. చడీచప్పుడు కాకుండా పెళ్లికి రెడీ అయిపోయింది.

తను చేసుకునే వాడిని పరిచయం చేస్తూ… ఫోటోలను కూడా రిలీజ్‌ చేసి.. నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది ఈ బ్యూటీ. నిజం చెప్పాలంటే నివేథా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ ఉమెన్‌. తన నటనతో ఆకట్టుకోవడమే కాకుండా కార్ రేసింగ్, బ్యాడ్మింటన్ పోటీల్లోనూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఈ మధ్యన తన తమ్ముడితో కలిసి ఫార్ములా కారు రేసింగ్‌లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏకంగా తాను దుబాయ్‌ బిజినెస్ మాన్ రాజ్ హిత్ ఇబ్రాన్‌ను పెళ్లి చేసుకోనున్నట్టు అనౌన్స్ చేసింది. రాజ్ హిత్ ఇబ్రాన్‌తో ఎప్పటి నుంచో నివేథా రిలేషన్‌ షిప్‌లో ఉంది. సినిమాలూ చేస్తూనే.. తన లవ్‌ లైఫ్‌ కారణంగా కొన్ని రోజులు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గడంతో.. పెళ్లికి రెడీ అయిపోయినట్టు తెలుస్తోంది. తన బాయ్‌ప్రెండ్‌ను తన నియర్ అండ్ డియర్స్ సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఇప్పుడు అఫీషియల్‌గా ఫోటోస్‌ తో పాటు ఆ విషయాన్ని రివీల్ చేసి… తన ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. దాంతో పాటే నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జియో,ఎయిర్‌టెల్‌కు BSNL షాక్..

నా భార్య తిరిగొచ్చింది.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ భర్త..

కోనేరు కనిపిస్తే దిగడమేనా? పద్ధతీ పాడూ లేదా? ఆలయంలో అపచారం

శరీరం తప్ప ఇంకేం కనిపించదా మీకు ?? మా బాధ అర్థం కాదు కదా.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

బన్నీ టీంలో హాలీవుడ్ మార్కెటింగ్ హెడ్! మనోడి రేంజ్‌ ఊహించనంత ఎత్తుకే