Kushboo: ఆ వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు.. భారీ మూల్యం చెల్లించుకుంటారు.: ఖుష్బూ.

|

Sep 29, 2024 | 3:03 PM

ఎవరికైనా తిరుపతి అంటే మొదట గుర్తుకు వచ్చేది.. లడ్డూ.. ఎవరైనా తిరుపతికి వెళ్లి వచ్చారంటే ఫస్ట్ లడ్డూ ఏది అని అడుగుతారు. అంతటి ప్రసిద్ధిగాంచిన తిరుపతి లడ్డూ కల్తీ వార్త దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఇక ఈ వివాదంపై పలువురు రాజకీయ నాయకులు, సినీనటులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి లడ్డూ కల్తీ కావడం పట్ల ఆవేదన చెంది.. దీక్ష తీసుకున్నారు.

ఎవరికైనా తిరుపతి అంటే మొదట గుర్తుకు వచ్చేది.. లడ్డూ.. ఎవరైనా తిరుపతికి వెళ్లి వచ్చారంటే ఫస్ట్ లడ్డూ ఏది అని అడుగుతారు. అంతటి ప్రసిద్ధిగాంచిన తిరుపతి లడ్డూ కల్తీ వార్త దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఇక ఈ వివాదంపై పలువురు రాజకీయ నాయకులు, సినీనటులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి లడ్డూ కల్తీ కావడం పట్ల ఆవేదన చెంది.. దీక్ష తీసుకున్నారు. తాజాగా నటి ఖుష్బూ కూడా ఈ వివాదంపై ఘాటుగా స్పందించారు. ఎక్స్‌లో ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందరూ తిరుపతి లడ్డూ గురించి బాగా మాట్లాడుతున్నారన్నారు. హిందూ మతాన్ని టార్గెట్ చేస్తే నోరు మూసుకోవాలా? అని ఖుష్భూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. తిరుమల లడ్డూ గురించి మాట్లాడే వారికి ఇతర మతాల గూర్చి ఇలా మాట్లాడేంత దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. అలా చేయాలంటేనే వెన్నులో వణుకు పుడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు ఆమె.

సెక్యులరిజం అంటే అన్ని మతాలను గౌరవించడం అని ఖుష్బూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అంతేగాని పక్షపాతంతో వ్యవహరించడం తగదన్నారు. తను ముస్లిం అయినా హిందూ వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు తెలిపారు. తనకు అన్ని మతాలూ సమానమని, హిందూ మతాన్నే కావాలని లక్ష్యంగా చేసుకొని అవమానించొద్దన్నారు. అగౌరవపరిస్తే సహించేది లేదన్నారు ఖుష్బూ..! ఇక తిరుపతి లడ్డూ కల్తీ వార్త.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందిని కలిచివేసిందని, బాధ్యులు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని ఖుష్బూ హెచ్చరించారు. ఇదంతా శ్రీ వెంకటేశ్వర స్వామి చూస్తాడన్నట్లు తన ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్లో చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on