Vishwak Sen: లైలా దెబ్బ ధాటికి.. మారిపోయిన హీరో

Updated on: Feb 23, 2025 | 1:04 PM

ఎన్నో అంచనాల మధ్య... యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల లైలా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. విశ్వక్ లైలా సినిమా థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన సినిమాకు ఊహించని రిజల్ట్ వచ్చింది.

అంతకు ముందు వచ్చిన మెకానిక్ రాకీ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ తన అభిమానులకు స్పెషల్ లెటర్ రాశారు. ముందు ముందు సినిమాల ఎంపికలో .. కంటెంట్‌ విషయంలో అసభ్యత లేకుండా జాగ్రత్త పడతానంటూ ఆ లెటర్ లో కోట్ చేశాడు. “నమస్తే.. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి.. నా అభిమానులకు, నా పై ఆశీర్వాదంగా నిలిచినవారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడు కొత్తదనం తీసుకురావడమే. కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే.. నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

OTTలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. మీరు కూడా ఆ కంటెంట్‌ చూస్తున్నారా?

Marco: ఆహాలో దూసుకుపోతున్న మార్కో

మనీలాండరింగ్ కేసులో బుక్కైన శంకర్.. దాదాపు 10 కోట్ల ఆస్తులు జప్తు

Chhaava: ఛావా సినిమా ఫ్యాన్స్‌కు ప్రభుత్వం బంపర్ ఆఫర్ !