Vishal: అవార్డులు చెత్తబుట్టలో వేస్తానన్న విశాల్‌.. అసలేమైంది

Edited By: Phani CH

Updated on: Oct 21, 2025 | 4:50 PM

ఐ డోంట్‌ బిలీవ్‌ ఇన్‌ అవార్డ్స్. అవార్డ్స్ అనేది పిచ్చితనం. నలుగురు కూర్చుని ఇన్ని కోట్ల మంది అభిప్రాయాలను డిక్లేర్‌ చేయగలుగుతారా? అంటూ విశాల్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కోలీవుడ్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఎవరిష్టం వారిది.. అని కొందరు అంటున్నా.. అలా ఎలా అంటారని చాలా మంది విస్తుపోతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? అవార్డులు ఇచ్చేవాళ్లు మేధావులా? అని ప్రశ్నిస్తున్నారు హీరో విశాల్‌.

సర్వే చేయండి.. దాన్ని బట్టి ఇవ్వండి అంతేగానీ, కమిటీలో కూర్చుని నేషనల్‌ అవార్డులు ఇస్తామంటే ఎలా? అని ఘాటుగా స్పందించారు. తనకు ఎవరైనా అవార్డు ఇస్తే చెత్త బుట్టలో వేస్తానన్నారు విశాల్‌. అందులో బంగారం ఉంటే కుదువపెట్టి అన్నదానం చేస్తానని చెప్పారు. డోంట్‌ బిలీవ్‌ ఇన్‌ అవార్డులు.. అని ఓపెన్‌గానే చెప్పేశారు విశాల్‌.ఎంతో మంది అవార్డులు రాలేదని బాధపడుతుంటే విశాల్‌ ఇలా అనడం ఏంటని విస్తుపోతున్నారు జనాలు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బక్కోడి ఖాతాలో బిగ్ హిట్ !! డ్రాగన్‌కు దిమ్మతిరిగే కలెక్షన్స్‌

డోంట్‌ ట్రబుల్‌ ద ట్రబుల్‌ అంటున్న ఫహాద్ ఫాజిల్‌

మీ ఓవర్ థింకింగ్‌ని తగ్గించే జపనీస్ టెక్నిక్స్ ఇవే

లవ్ సింబల్‌లా తాటి చెట్లుపల్లెలో ప్రకృతి దృశ్యం

పసరికపాము అనుకునేరు.. కాటు వేస్తే కాటికే…