Mohanlal: మోహన్ లాల్ ‘అమ్మ’కు రాజీనామా.. మాలీవుడ్ లో హేమ కమిటీ ఎఫెక్ట్.!
కేరళ చిత్రపరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల వివాదం రచ్చ రచ్చగా మారుతోంది. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అమ్మ సభ్యులపైనే లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో చాలా మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అమ్మ అధ్యక్ష పదవికి మోహన్‌లాల్ రిజైన్ చేయగా ఆయన వెన్నంటి 17 మంది కమిటీ సభ్యులు నడిచారు. అంతేకాదు అమ్మ కమిటీని పూర్తిగా రద్దు చేసేశారు. కొత్త కమిటీని త్వరలో ఎన్నుకోనున్నారు.
కేరళ చిత్రపరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల వివాదం రచ్చ రచ్చగా మారుతోంది. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అమ్మ సభ్యులపైనే లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో చాలా మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అమ్మ అధ్యక్ష పదవికి మోహన్‌లాల్ రిజైన్ చేయగా ఆయన వెన్నంటి 17 మంది కమిటీ సభ్యులు నడిచారు. అంతేకాదు అమ్మ కమిటీని పూర్తిగా రద్దు చేసేశారు. కొత్త కమిటీని త్వరలో ఎన్నుకోనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌లో పలు షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. దీనిపై భారీ విమర్శలు వస్తున్న వేళ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అధ్యక్ష పదవికి నటుడు మోహన్‌లాల్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులు కూడా పదవుల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ‘అమ్మ’ సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.
కమిటీలోని కొందరు సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయని, నైతిక బాధ్యతగా వీళ్లందరూ ఇప్పుడు రాజీనామా చేసినట్లు ఓ ప్రకటనలో చెప్పారు. అయితే ఈ మూకుమ్మడి రాజీనామాల వల్ల మలయాళ చిత్రమండలిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త పాలక మండలిని రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్ కండిషన్లు, రెమ్యూనరేషన్, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను రీసెర్చ్ చేసిన హేమా కమిటీ, కాస్టింగ్ కౌచ్ నుంచి వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు పడుతున్న అనేక ఇబ్బందుల గురించి అందులో పేర్కొంది. ఇప్పుడీ కమిటీ రూపొందించిన నివేదికే మాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.