ఏపీ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం.. షటిల్ ఆడుతూ కుప్పకూలిన సీఐ భగవాన్.. అక్కడిక్కడే గుండెపోటుతో మృతి..!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇన్స్‌పెక్టర్ ఆడుతూ ఆకస్మాత్తుగా కిందపడి చనిపోయాడు.

eluru ci collapse and died: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇన్స్‌పెక్టర్ ఆడుతూ ఆకస్మాత్తుగా కిందపడి చనిపోయాడు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భగవాన్ ప్రసాద్ పశ్చిమగోదావరి జిల్లా గణవరంలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రోజూ షటిల్ ఆడటం ఆయనకు అలవాటు. ఎప్పటిలాగే గణవపరం పోలీస్ స్టేషన్ సమీపంలో షటిల్ ఆడేందుకు వెళ్లారు. ఆట మధ్యలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.. వెంటనే అప్రమత్తమైన తోటి క్రీడాకారులు ఆయనను పైకి లేపేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయన నిర్జీవంగా పడిపోయారు.
దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. సీఐను వెంటనే గణపవరంలో ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే భగవాన్ చనిపోయినట్లు స్థానిక వైద్యులు నిర్ధారించారు. భగవాన్ గుండెపోటుతో చనిపోయారని అనుమానిస్తున్నారు. సౌమ్యుడిగా మంచి పేరున్న ఆయన ఆకస్మిక మృతితో పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. సీఐ భగవాన్ మృతి పట్ల పలువురు పోలీసు ఉన్నతాధికారులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీఐ షటిల్ ఆడుతూ కుప్పకూలడం సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. ఇందుకు సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Read Also.. Women Suicide: జనవరిలో వివాహం.. అప్పుడే భర్త వేధింపులు.. ఆత్మహత్యకు పాల్పడిన నవవధువు.. కారణం తెలిస్తే..