Independence Day: గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ కలకలం

Independence Day: గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ కలకలం

Ram Naramaneni

|

Updated on: Aug 15, 2024 | 1:28 PM

గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేశ్ హాజరయ్యాయి. ఈ సమయంలో.. ఒక్కసారిగా డ్రోన్ రావడంతో.. పోలీసులు షాక్‌కు గురయ్యారు.

గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ కలకలం చెలరేగింది.  పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఓ యువతి డ్రోన్ ఎగరేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నాడు.  పరేడ్‌ను రికార్డు చేసేందుకు డ్రోన్ ఎగురవేసినట్టు సదరు యువతి చెబుతోంది. అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న స్వాతంత్ర వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.ఆ సమయంలో ఇలా డ్రోన్ ఎగురవేయడాన్ని సెక్యూరిటీ బ్రీచ్‌ కింద అధికారులు పరిగణిస్తున్నారు. ఆ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..