రోజూ 15 నిమిషాలు సైక్లింగ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా
ప్రస్తుత కాలంలో చాలామంది ఫిట్‌నెస్ గురించి ఆలోచిస్తున్నారు. కానీ అందుకు సమయం కేటాయించలేకపోతున్నారు. అయితే రోజు కేవలం 15 నిమిషాలు కేటాయిస్తే చాలు. మంచి ఆరోగ్యం మీ సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజు ఒక పావుగంట సైక్లింగ్ చేసేందుకు సమయం కేటాయిస్తే శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందంటున్నారు.
నిపుణుల ప్రకారం సైక్లింగ్ చేయడం వల్ల కాళ్లు, పిక్కలు, తొడల భాగాలలోని కండరాలు బలంగా మారుతాయి. లోయర్ బాడీ మొత్తం స్ట్రాంగ్‌గా మారుతుంది. శక్తివంతమైన శరీరం మీ సొంతం అవుతుంది. ఎక్కువ సమయం కూర్చుని ఉద్యోగాలు చేసేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సైక్లింగ్ వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. రోజు 15 నిమిషాలు సైక్లింగ్ చేయడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం సమయంలో దీనిని అలవాటు చేసుకుంటే త్వరగా ఫలితాలు కనిపిస్తాయి. సైక్లింగ్ వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే సంతోషకరమైన హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి మంచి ఫీలింగ్‌ని కలిగిస్తుంది. మూకాలు, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మంచి నిద్ర పడుతుంది. ఉదయం సైక్లింగ్ చేస్తే రోజంతా ఉల్లాసంగా ఉంటారు. హైబీపీ తగ్గుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది మితంగా తీసుకుంటే గుండెకు మేలు చేస్తుంది.. మోతాదు మించితే హానికరం
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

