దీపకాంతుల్లో అయోధ్య.. రెండు గిన్నిస్ రికార్డులు
దీపావళి పండుగ సందర్భంగా అయోధ్య దీపాలతో వెలిగిపోయింది. సరయూ నదీ తీరాన గల ఘాట్‌లలో వేలాది మంది తరలివచ్చి ఏకంగా 26 లక్షల 17 వేల దీపాలను వెలిగించారు. ఈ దీపోత్సవం గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. అదే విధంగా, సరయూ నదికి..ఒకేసారి 2,128 మంది భక్తులు హారతులు నిర్వహించడం కూడా మరో రికార్డుగా నమోదైంది. మొత్తంగా అయోధ్యలో వెలుగుల పండుగ శోభాయమానంగా జరిగింది.
దీపావళి పండుగ సందర్భంగా అయోధ్య దీపాలతో వెలిగిపోయింది. సరయూ నదీ తీరాన గల ఘాట్‌లలో వేలాది మంది తరలివచ్చి ఏకంగా 26 లక్షల 17 వేల దీపాలను వెలిగించారు. ఈ దీపోత్సవం గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. అదే విధంగా, సరయూ నదికి..ఒకేసారి 2,128 మంది భక్తులు హారతులు నిర్వహించడం కూడా మరో రికార్డుగా నమోదైంది. మొత్తంగా అయోధ్యలో వెలుగుల పండుగ శోభాయమానంగా జరిగింది. దీపోత్సవం సందర్భంగా సరయూ నదీ తీరంలోని ఘాట్‌లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. రామ్‌లీలా ప్రదర్శనలు, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రామ్ కీ పైడీ ఘాట్ దగ్గర CM యోగి ఆదిత్యనాథ్ స్వయంగా హారతిని నిర్వహించి రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారణలో కళాకారులు రథాన్ని లాగుతూ దీపోత్సవానికి శ్రీకారం చుట్టారు. భక్తుల సందడి, దీపాల కాంతితో కనిపించిన ఆ భవ్య దృశ్యం ఆకట్టుకుంది. రామజన్మభూమి ప్రాంగణం నుంచి సరయూ తీరం వరకు వెలుగుల హారం భారత సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచింది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సాంకేతికతల మేళవింపుతో అంగరంగ వైభవంగా ఈ దీపోత్సవం జరిగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ల్యాండ్ అవుతూ.. కుప్పకూలిన విమానం
ఆ ఏడు గ్రామాల్లో నిశ్శబ్ద దీపావళి.. కారణం..
చిరు ఇంట తారల దీపావళి వేడుక నాగ్, వెంకీ, నయన్‌ల సందడి
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. మంగళవారం తులం ఎంతంటే ??
