అద్భుతం.. పద్మావతి అమ్మవారికి పసుపు కొమ్ముల అలంకరణ
ధనుర్మాసం శ్రీ వేంకటేశ్వరస్వామికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పవిత్ర మాసంలో భీమవరం జేపీ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పద్మావతి అమ్మవారికి 160 కిలోల పసుపు కొమ్ములతో అద్భుత అలంకరణ చేశారు. భక్తులకు శుభం చేకూరుతుందని అర్చకులు తెలిపారు. లక్ష తులసి పూజ, గాజుల అలంకరణ, ముక్కోటి ఏకాదశి వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి అలంకరణ ప్రియులు. భక్తులు వివిధాలకరణల్లో ఆయన్ను కొలుస్తారు. ఇక ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో ప్రత్యేక అలంకరణలు, పూజలు జరుగుతాయి. ఆయనకు చాలా ఇష్టమైన నెల కావటం తో వేంకటేశ్వరస్వామి , పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలతో పాటు ప్రత్యేక అలంకరణలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్డు లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పద్మావతి అమ్మవారికి పసుపు కొమ్ములతో ప్రత్యేక అలంకరణ చేశారు. ధనుర్మాసం కావడంతో 160 కిలోల పసుపు కొమ్ములతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసారు ఆలయ అర్చకులు. వేంకటేశ్వరస్వామి వారికి ధనుర్మాసం ప్రీతికరమైన మాసం అని ఆలయ అర్చకులు చెబుతున్నారు. భక్తుల దర్శనార్థం పసుపు కొమ్ములు అలంకరణను రెండు రోజులు కొనసాగిస్తామని తెలిపారు. పసుపు కొమ్ములతో అలంకరణ చేయడం వల్ల శుభం కలుగుతుందని అంటున్నారు. ధనుర్మాసంలో వేంకటేశ్వరస్వామి స్వామి వారికి ప్రత్యేక అర్చనలు, సేవలు, పూజలు నిర్వహిస్తామని ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. డిసెంబరు 23 మంగళవారం లక్ష తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన, 26 శుక్రవారం పద్మావతి అమ్మవారికి గాజుల అలంకరణ చేస్తామని తెలిపారు. ఈ నెల 30 వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్బంగా తెల్లవారుజాము నుంచి స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంపేస్తోన్న చలి.. అత్యల్ప ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డ్
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అమెరికా వెళ్లటం ఇక కష్టమే బాస్.. టూరిస్ట్ వీసాపైనా సవాలక్ష ఆంక్షలు
