Tea Bag: డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.! టీ కలిపేటప్పుడు చాల జాగ్రత్త.!

Updated on: Dec 28, 2024 | 6:31 PM

వాణిజ్య టీ బ్యాగుల వినియోగం కారణంగా లక్షల సంఖ్యలో నానోప్లాస్టిక్‌లు విడుదలవుతున్న తీరును స్పానిష్‌ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. ఇవి మానవ పేగు కణాల్లోకి చొచ్చుకెళ్లి, తద్వారా రక్తప్రవాహంలో కలిసిపోయి, శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉందని తేల్చారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల కాలుష్యం పర్యావరణానికి పెద్ద సవాల్‌. భవిష్యత్‌ తరాల ఆరోగ్యానికి ఇవి పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉంది. మైక్రో, నానో ప్లాస్టిక్‌ కాలుష్యానికి ఆహార ప్యాకింగ్‌ ప్రధాన కారణం. శ్వాస, ఆహారం ద్వారా ఇవి మనుషుల్లోకి వెళుతుంటాయి.

ఈ నేపథ్యంలో బార్సిలోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.. వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న పలురకాల టీ బ్యాగుల్లోని సూక్ష్మ, నానో ప్లాసిక్‌ల తీరుతెన్నులను పరిశీలించారు. నైలాన్‌-6, పాలీప్రొపలీన్, సెల్యులోజ్‌ వంటి పాలీమర్లతో తయారైన కొన్ని టీ బ్యాగులపై పరిశోధన జరిపారు. వీటి సాయంతో టీ కలిపేటప్పుడు భారీ స్థాయిలో నానో రేణువులు, పోగులు విడుదలైనట్లు గుర్తించారు. పాలీప్రొపలీన్‌.. మిల్లీలీటర్‌కు 120 కోట్ల రేణువులను విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో రేణువు పరిమాణం సరాసరిన 136.7 నానోమీటర్లుగా ఉంది. సెల్యులోజ్‌ ద్వారా మిల్లీలీటర్‌కు 13.5 కోట్ల రేణువులు, నైలాన్‌-6 ద్వారా 81.8 లక్షల రేణువులు వెలువడుతున్నట్లు గుర్తించారు.

ఈ ప్లాస్టిక్‌ రేణువులు మానవుల్లోని భిన్నరకాల పేగు కణాల్లో ఉంచి పరిశీలించారు. వీటిలో మ్యూకస్‌ను ఉత్పత్తి చేసే కణాలు.. సూక్ష్మ, నానో ప్లాస్టిక్‌లను ఎక్కువగా శోషించుకుంటున్నట్లు తేలింది. అవి జన్యు పదార్థం ఉండే కణ కేంద్రకంలోకీ ప్రవేశిస్తున్నట్లు వెల్లడైంది. దీనివల్ల మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలంలో పడే ప్రభావాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.