ఎడ్లబండిపై ఛలో ఛలో.. పిల్లలను బడిబాట పట్టించేందుకు వినూత్న ప్రయోగం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా కుంటాల మండలం పెంచికల్పాడు గ్రామంలో వినూత్నంగా నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఎడ్లబండి పై ఉపాధ్యాయులు కూర్చుని ప్రధాన వీధుల గుండా ర్యాలీగా వెళ్తూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలంటూ.. ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న వసతుల గురించి ప్రజలకు తెలుపుతూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా కుంటాల మండలం పెంచికల్పాడు గ్రామంలో వినూత్నంగా నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఎడ్లబండి పై ఉపాధ్యాయులు కూర్చుని ప్రధాన వీధుల గుండా ర్యాలీగా వెళ్తూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలంటూ.. ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న వసతుల గురించి ప్రజలకు తెలుపుతూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.
ప్రైవేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ బడే ముద్దు అనే నినాదంతో ఐదు ఏళ్లు నిండిన విద్యార్థుల ఇంటికి వెళ్లి పూలమాలతో సత్కరించి పాఠశాలల్లో ప్రవేశం కల్పించారు. వినూత్న రీతి ప్రచారంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
వైరల్ వీడియోలు
Latest Videos