Banana: అరటి పండ్లపై నల్లటి మచ్చలు హాని కారకమా ??

|

Aug 17, 2022 | 8:47 AM

అరటి పండ్లంటే అందరికీ ఇష్టమే..ఎన్నో పోషకాలుండే ఈ పండ్లతో ప్రయోజనాలెన్నో. కానీ అరటి పండ్లపై నల్లటి మచ్చ ఉంటే హాని కారకమని చాలా మంది నమ్ముతుంటారు.

అరటి పండ్లంటే అందరికీ ఇష్టమే..ఎన్నో పోషకాలుండే ఈ పండ్లతో ప్రయోజనాలెన్నో. కానీ అరటి పండ్లపై నల్లటి మచ్చ ఉంటే హాని కారకమని చాలా మంది నమ్ముతుంటారు. నల్లమచ్చలున్న అరటి పండ్లను తినకూడదా..? తింటే ఏం అవుతుందో తెలుసుకోండి.. అరటి పండ్లు తొందరగా జీర్ణం అవుతాయి. సహజ పోషకాలను సత్వరం అందిస్తాయి. అరటి పండ్లపై నల్లని మచ్చలుంటే కుళ్లినవని కాదు..నలుపు, గోధుమవర్ణం మచ్చలు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచివని నిపుణులు చెబుతున్నారు. నల్లమచ్చలు టీఎన్‌ఎఫ్‌ ట్యూమర్‌ నిక్రోసిస్‌ ఫ్యాక్టర్‌ ను సూచిస్తాయి. ఇది క్యాన్సర్‌ పోరాట పదార్థం. ఇది శరీరంలోని అసాధారణ కణాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. బాగా పండినపుడు అరటిపండులో యాంటీ అక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది వైరస్‌, క్యాన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా రోగనిరోధకతను పెంచుతుంది. అరటిపండ్లు పండే కొద్దీ మెగ్నిషియం పెరుగుతుంది. రక్తపోటుతో బాధ పడుతున్న వారికి చాలా మంచిది. తక్షణమే అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండెకు చాలా మేలు చేస్తుంది. పేగుల్లో కదలికలను బాగా ఉంచుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు సహకరిస్తుంది. అసిడిటీని బాగా తగ్గిస్తుంది. ఇందులో పీచు పదార్థం కూడా అధికంగానే ఉంటుంది. మల బద్దకం లేకుండా చేస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ ఆలయంలో బంగారమే ప్రసాదం !! వజ్ర వైఢూర్యాలతో పూజలందుకుంటున్న దేవత

వరమాల వేయరా అంటే ఆగమైన పెళ్లికొడుకు.. ఇదెక్కడి పరేషాన్‌రా బాబు..

పిల్లి కూనను కంటికి రెప్పలా కాపాడుతున్న కుక్క !! మూగజీవుల స్నేహానికి స్థానికులు ఫిదా

వెన్నులో వణుకు పుట్టిస్తోన్న కారు స్టంట్‌.. ఓ రేంజ్‌లో తిడుతున్న నెటిజన్లు..

Follow us on