Paytm: లోయర్ సర్క్యూట్‌కు పేటీఎం షేర్.. ఎందుకిలా.? ఈడీ దర్యాప్తు వార్తలే కారణమా?

|

Feb 06, 2024 | 5:20 PM

ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం’ షేర్ సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ల అంతర్గత ట్రేడింగ్ లో లోయర్ సర్క్యూట్‌ 438.35 రూపాయలను తాకి మరో 10 శాతం నష్టపోయింది. హవాలా లావాదేవీలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయనుందన్న వార్తల నేపథ్యంలో పేటీఎం మరింత చిక్కుల్లో పడింది. గత మూడు సెషన్లలో పేటీఎం షేర్ 42.4 శాతం విలువ కోల్పోయింది.

ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం’ షేర్ సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ల అంతర్గత ట్రేడింగ్ లో లోయర్ సర్క్యూట్‌ 438.35 రూపాయలను తాకి మరో 10 శాతం నష్టపోయింది. హవాలా లావాదేవీలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయనుందన్న వార్తల నేపథ్యంలో పేటీఎం మరింత చిక్కుల్లో పడింది. గత మూడు సెషన్లలో పేటీఎం షేర్ 42.4 శాతం విలువ కోల్పోయింది. దీంతో 20,500 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయింది. తాజా వార్తల నేపథ్యంలో మార్కెట్లో ఇన్వెస్టర్లు జీర్ణించుకునే పరిస్థితుల్లో లేరని, ఇప్పటి వరకు ఉన్న ఇన్వెస్టర్లు తమ స్టాక్స్ విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారని యాక్సిస్ సెక్యూరిటీస్ రాజేశ్ పాల్వియా చెప్పారు. 2021 నుంచి హవాలా లావాదేవీలు, ఇల్లీగల్ బెట్టింగ్ ఆరోపణలపై పేటీఎం.. ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటుంది. పేటీఎం నుంచి హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు సందేహాలు వ్యక్తం అవుతున్నాయని, నో యువర్ కస్టమర్ కేవైసీ నిబంధనలు ఉల్లంఘించినట్లు అనుమానాలు ఉన్నాయని కొన్ని నెలల క్రితమే ఈడీ అధికారులను ఆర్బీఐ అలర్ట్ చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లో పేరెంట్ సంస్థ ‘పేటీఎం’కు 49 శాతం వాటా ఉంది. తాజా పరిణామాలు పేటీఎం ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని జెఫరీస్ అనలిస్ట్స్ పేర్కొంది. దీనివల్ల సుపరిపాలన, రుణ పరపతి బిజినెస్ సవాళ్లను ఎదుర్కొంటుందని తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..