భారీగా నగలు ధరిస్తే.. రూ. 50 వేలు జరిమానా !

Updated on: Oct 30, 2025 | 5:30 PM

భారతీయ మహిళామణులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్ని నగలున్నా.. ఇంకా ఇంకా నగలు చేయించుకోవాలనే వారు కోరుకుంటూ ఉంటారు. ఇక..శుభకార్యాల వేళ ఒంటినిండా నగలు వేసుకుని.. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని తెగ ఆరాటపడుతుంటారు. చేతిలో కాస్త పొదుపు డబ్బు సమకూరితే.. నేరుగా బంగారం షాపులో తిష్టవేసి.. అవసరమైతే కాస్త అప్పు చేసైనా నచ్చిన నగను సొంతం చేసుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు.

అవసరమైతే టక్కున నగదుగా మార్చుకొని.. మరొకరి దగ్గర అప్పుచేయాల్సిన అవసరం రాదనే దూరదృష్టి కూడా మన మహిళల తాపత్రయంలో దాగుంది. అయితే.. బంగారం మీద అంత మమకారం తగదంటున్నారు ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామపెద్దలు. ఇకపై, ఒంటినిండా నగలు వేసుకునే గ్రామపు మహిళలకు జరిమానా కూడా వేస్తామని వారు ప్రకటించారు. ఉత్తరాఖండ్‌ లోని ఆ గ్రామస్తులు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ జిల్లాలో ఉన్న కందద్, ఇంద్రోలి అనే రెండు గ్రామాల్లో.. మహిళలు బంగారు నగలు ధరించడంపై వింత నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచీ తమ గ్రామంలోని మహిళలు..శుభకార్యాల సమయంలో మూడు బంగారు నగలు మాత్రమే ధరించాలని గ్రామ పెద్దలు ఓ రూల్ పాస్ చేసేశారు. చెవిపోగులు, మంగళ సూత్రం, ముక్కు పుడక మాత్రమే ధరించాలని ప్రకటించారు. ఒకవేళ ఈ షరతును ఉల్లంఘిస్తే రూ.50,000 జరిమానా వేస్తామని హెచ్చరించారు. ఆడంబరాలను అరికట్టడం, ఆర్థిక అసమానతలను తగ్గించడం కోసం ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు. గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్థానిక మహిళలు స్వాగతించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయా ??

సడెన్‌గా బ్లూ కలర్‌లోకి మారిన వీధికుక్కలు.. ఎక్కడంటే ??

చెట్టెక్కి కొట్టుకున్న సింహం-చిరుత.. తర్వాతి సీన్‌ చూస్తే నవ్వాగదు

ఆ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పెన్షనర్లకూ పండగే

వామ్మో.. క్షుద్ర పూజలకు ఇలాంటి జంతువును బలిస్తారా?