Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
జనవరి 9న బంగారం ధరలు దూసుకెళ్లాయి, 24 క్యారెట్ల పది గ్రాములు రూ.1,38,710, 22 క్యారెట్ల పది గ్రాములు రూ.1,27,150కి చేరాయి. డాలర్ బలహీనపడటం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రధాన కారణాలు. అయితే, వెండి ధర రూ.4000 తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రస్తుత ధరలను తెలుసుకోండి. జనవరి 9 శుక్రవారం మార్కెట్ ప్రారంభం కావడంతోనే బంగారం ధర దూసుకెళ్లింది.
జనవరి 9 శుక్రవారం మార్కెట్ ప్రారంభం కావడంతోనే బంగారం ధర దూసుకెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనపడటం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను బంగారం వైపు మళ్ళిస్తున్నాయి. జనవరి 9, శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.710 లు పెరిగి రూ. 1,38,710లు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650లు పెరిగి రూ.1,27,150లకు చేరింది. వెండి మాత్రం కిలో కి రూ.4000 తగ్గి, రూ.2,68,000లు పలుకుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,38,860, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,300 పలుకుతోంది. ముంబై లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,711 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,27,150 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,640, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,000 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,38,710 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ. 1,27,150 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,38,711 ఉంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,150 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,68,000 పలుకుతోంది. ఈ ధరలు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నమోదైనవి.. ఇవి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్ చేసుకోండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాతికి దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీలో ఆ జిల్లాలకు అలెర్ట్!
‘ఆధార్’ అక్రమాలకు అడ్డుకట్ట.. కొత్త డిజిటల్ యాప్ వచ్చేసింది
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే..
సంక్రాంతికి లగ్జరీ కారవాన్‌లో జాలీ ట్రిప్.. ఏపీ టూరిజం స్పెషల్ ప్యాకేజీ రెడీ
