ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్..! రెండున్నర గంటలు సేవలకు అంతరాయం.:SBI alert warns customers video.
ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్రస్తుతం ముఖ్యమైన కార్యకలాపాల్లో ఒకటిగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. అందుకే ఎక్కువగా ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి అవసరమైన వస్తువులను ఇంటినుంచే పొందుతున్నారు.
ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్రస్తుతం ముఖ్యమైన కార్యకలాపాల్లో ఒకటిగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. అందుకే ఎక్కువగా ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి అవసరమైన వస్తువులను ఇంటినుంచే పొందుతున్నారు. ఒకవేళ అత్యవసర సమయంలో బయటకు వెళ్లినా.. ఆన్‌లైన్ పద్దతుల్లోనే నగదును చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో పలు బ్యాంకులు కూడా తమ సేవలను సులభతరం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ కూడా సేవలను సులభతరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఎస్‌బీఐ సేవలు రేపు (గురువారం) రెండున్నర గంటలపాటు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. జూన్ 17 (బుధవారం అర్ధరాత్రి) ఎస్‌బీఐ ప్రత్యేక సేవలు అర్ధరాత్రి 12.30 నుంచి 2.30 గంటల వరకు నిలిచిపోనున్నాయని పేర్కొంది.
మరిన్ని ఇక్కడ చూడండి: కోవిషీల్డ్ డోసుల మధ్య విరామ కాలాన్ని ఎందుకు పెంచామంటే..! కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వివరణ..:covishield gap video.