Nirmala Sitharaman: మేం జోక్యం చేసుకోలేం.! ఆర్బీఐతోనే తేల్చుకోండి..: నిర్మలా సీతారామన్‌.

|

Feb 08, 2024 | 9:44 AM

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ విధించిన ఆంక్షల నుంచి బయటపడేందుకు కంపెనీ వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే సంస్థ సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తో సమావేశమైనట్లు సమాచారం. 10 నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకునేది ఏమీ లేదని ఆర్థిక మంత్రి చెప్పినట్లు సమాచారం.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ విధించిన ఆంక్షల నుంచి బయటపడేందుకు కంపెనీ వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే సంస్థ సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తో సమావేశమైనట్లు సమాచారం. 10 నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకునేది ఏమీ లేదని ఆర్థిక మంత్రి చెప్పినట్లు సమాచారం. ఆర్‌బీఐతోనే సమస్యను పరిష్కరించుకోవాలని, వారి మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్మలా సీతారామన్‌ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు, రెగ్యులేటరీ ఆంక్షలపై చర్చించేందుకు ఆర్‌బీఐ అధికారులతోనూ విజయ్‌ శర్మ సమావేశమైనట్లు సమాచారం. పేటీఎంకు చెందిన పేమెంట్స్‌ బ్యాంక్‌కు ఇటీవల ఆర్‌బీఐ షాకిచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత ఏ కస్టమర్‌, ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌, వ్యాలెట్‌, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు చేపట్టకూడదని ఆదేశించింది. సమగ్ర సిస్టమ్‌ ఆడిట్‌, బయట ఆడిటర్ల నివేదికలను అనుసరించి ఈ చర్యలు తీసుకుంది. బ్యాంక్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించామని ఆర్‌బీఐ తెలిపింది. ఈ పరిణామాలతో ఇటీవల కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. మరోవైపు, పేటీఎంపై ఆంక్షలు వెనక్కి తీసుకునే అంశాన్ని పరిశీలించాలని పలు ప్రముఖ అంకుర సంస్థల వ్యవస్థాపకులు ప్రభుత్వానికి లేఖ రాశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..