5 నిమిషాల ముందు కూడా ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు

|

May 28, 2024 | 12:11 PM

ఊళ్లకు వెళ్లేటప్పుడు సౌకర్యమైన ప్రయాణం కోసం చాలామంది రైలునే ఎంచుకుంటారు. కొన్ని నెలల ముందే ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసుకుంటారు. ఒకవేళ ఒక రోజు ముందు మన ప్రయాణం కన్ఫామ్‌ అయితే.. తత్కాల్‌ బుకింగ్‌ ఉండనే ఉంది. అదే కొన్ని గంటల ముందు ప్రయాణం నిర్ణయమైతే ఎలా? అలాంటి వారికి మరో అవకాశం ఉంది. టికెట్లు ఖాళీ ఉంటే రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

ఊళ్లకు వెళ్లేటప్పుడు సౌకర్యమైన ప్రయాణం కోసం చాలామంది రైలునే ఎంచుకుంటారు. కొన్ని నెలల ముందే ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసుకుంటారు. ఒకవేళ ఒక రోజు ముందు మన ప్రయాణం కన్ఫామ్‌ అయితే.. తత్కాల్‌ బుకింగ్‌ ఉండనే ఉంది. అదే కొన్ని గంటల ముందు ప్రయాణం నిర్ణయమైతే ఎలా? అలాంటి వారికి మరో అవకాశం ఉంది. టికెట్లు ఖాళీ ఉంటే రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఏవో కారణాలతో ప్రయాణం రోజునే టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకొనే వారు చాలా మంది ఉంటారు. అలాంటి సందర్భంలో ఖాళీగా ఉన్న టికెట్లను విక్రయించేందుకు రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రతి ట్రైన్‌ టికెట్‌ బుకింగ్‌ కన్ఫర్మేషన్‌ కోసం రైల్వే శాఖ రెండు ఛార్ట్‌లను ప్రిపేర్‌ చేస్తుంది. ఫస్ట్‌ ఛార్ట్‌ అనేది రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు ప్రిపేర్‌ అవుతుంది. రెండో ఛార్ట్‌ రైలు స్టార్ట్‌ అవ్వడానికి ముందు రూపొందిస్తారు. గతంలో అరగంట ముందు వరకు మాత్రమే టికెట్‌ బుకింగ్‌కు అనుమతించేవారు. ఇప్పుడు రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందు వరకు ఆ వెసులుబాటు కల్పించారు. కాబట్టి ట్రైన్‌ స్టార్ట్‌ అయ్యే ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉంటే ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. అప్పటికీ దొరక్కపోతే ప్రత్యామ్నాయాలను చూసుకోవచ్చు. చివరి నిమిషం వరకు ట్రైన్ టికెట్లు బుక్‌ చేసుకోసుకోవడం కోసం ముందుగా అందులో సీట్లు ఖాళీ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. రైల్వే శాఖ ప్రిపేర్‌ చేసే ఆన్‌లైన్‌ ఛార్ట్‌ ద్వారా ఈ విషయం తెలుసుకోవచ్చు. దీనికోసం ముందుగా IRCTC యాప్‌ ఓపెన్‌ చేసి ట్రైన్‌ సింబల్‌పై క్లిక్‌ చేస్తే.. ఛార్ట్‌ వేకెన్సీ సదుపాయం కనిపిస్తుంది. లేదా నేరుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్‌ చేయొచ్చు. అక్కడ ట్రైన్‌ పేరు/నంబర్‌, తేదీ, ఎక్కాల్సిన స్టేషన్‌ వివరాలు ఎంటర్‌ చేసి GET TRAIN CHARTపై క్లిక్‌ చేయాలి. వెంటనే అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలు కనిపిస్తాయి. సీటు ఉంటే టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఒకవేళ సీట్లు లేకపోతే సున్నా చూపిస్తుంది. కోచ్‌ నంబర్‌, బెర్త్‌… మొత్తం వివరాలు అక్కడే కనిపిస్తాయి. ట్రైన్‌ ప్రారంభం అయ్యే స్టేషన్లలో ఎక్కేవారికే ఈ ఆప్షన్‌ ప్రయోజనకరంగా ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: దీపిక తీరుతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో పట్టరానంత కోపం | పోలీసులకు హేమ బిగ్ ఝలక్‌

హీరోయిన్‌ను దారుణంగా చంపిన తండ్రి.. మరణశిక్ష విధించిన కోర్టు

Aaradhyadevi: అందం వెనక ఆవేదనను, కష్టాన్ని చెప్పుకొని ఇన్‌స్టా బ్యూటీ ఎమోషనల్

Naa Anveshana: ఆటగాళ్ల మధ్య మాటల ముచ్చట.. మామూలుగా లేదుగా

Sobhita Dhulipala: నథింగ్ అనుకునేరు.. కోట్లలో సంపాదన ఈమెది