Sukanya Samriddhi: సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీ పెట్టుబడికి భారీ ఆదాయం.. పన్ను ఆదా!
ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు అయి ఉండాలి. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి ఆమెకు 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు సుకన్య సమృద్ధి అకౌంట్ ను ప్రారంభించవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు కుమార్తెల పేరుతో ఖాతాను ప్రారంభించొచ్చు. అకౌంట్ ను పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖలో స్టార్ట్ చేయవచ్చు. మరి ఈ పథకం ద్వారా ఎంత రాబడి వస్తుంది? ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన పథకం ఒకటి. ఇది ఆడ పిల్లలపై ప్రత్యేకించి రూపొందించిన పథకం. ఇందులో పదేళ్లలోపు ఉన్న ఆడ పిల్లలపై ఆ పథకం ఓపెన్ చేసేందుకు అర్హులు. ఈ పథకం ద్వారా కూతురు వివాహం కోసం లేదా ఆమె పై చదువుల నిమిత్తం భారీ మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి మీరు భారత పౌరుడై ఉండాలి. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు అయి ఉండాలి. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి ఆమెకు 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు సుకన్య సమృద్ధి అకౌంట్ ను ప్రారంభించవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు కుమార్తెల పేరుతో ఖాతాను ప్రారంభించొచ్చు. అకౌంట్ ను పోస్టాఫీసు లేదా బ్యాంకు శాఖలో స్టార్ట్ చేయవచ్చు. మరి ఈ పథకం ద్వారా ఎంత రాబడి వస్తుంది? ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..