Insurance Claim: ప్రమాద బీమా క్లెయిమ్‌లో ఎఫ్‌ఐఆర్‌ ఎంత కీలకం? ఎలా ఫైల్ చేయాలి?

Insurance Claim: ప్రమాద బీమా క్లెయిమ్‌లో ఎఫ్‌ఐఆర్‌ ఎంత కీలకం? ఎలా ఫైల్ చేయాలి?

Subhash Goud

|

Updated on: Jan 22, 2024 | 7:11 PM

మీరు బీమా క్లెయిమ్‌ను ఫైల్ చేస్తుంటే, అన్ని  క్లెయిమ్ సంబంధిత డాక్యుమెంట్‌లను ఒకేసారి సమర్పించడానికి ప్రయత్నించండి. మీరు అన్ని డాక్యుమెంట్‌లను సమర్పించే వరకు బీమా కంపెనీ క్లెయిమ్‌ను మంజూరు చేయదు. చాలా సార్లు, బీమా కంపెనీ కొన్ని వివరణలు , సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను కూడా అడుగుతుంది. మీరు మీ స్టేట్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ..

ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే బాధితుడికి ఏదైనా ఇన్సూరెన్స్‌ పాలసీ ఉన్నట్లయితే క్లెయిమ్‌ చేయడంలో ఎఫ్‌ఐఆర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. నిబంధనల ప్రకారం, ఈ క్లెయిమ్‌ను సంఘటన జరిగిన 30 రోజులలోపు ఫైల్ చేయాలి. అయితే, క్లెయిమ్ ఫైల్ చేయడానికి ఎటువంటి కాల పరిమితీ లేదు. మీరు 30 రోజుల తర్వాత క్లెయిమ్ ఫైల్ చేస్తే, బీమా కంపెనీ ఆలస్యానికి గల కారణాన్ని అడగవచ్చు . అన్ని పత్రాలు అందిన తేదీ నుండి ఒక నెలలోపు బీమాదారు క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించాలి. బీమా క్లెయిమ్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

“మీరు బీమా క్లెయిమ్‌ను ఫైల్ చేస్తుంటే, అన్ని  క్లెయిమ్ సంబంధిత డాక్యుమెంట్‌లను ఒకేసారి సమర్పించడానికి ప్రయత్నించండి. మీరు అన్ని డాక్యుమెంట్‌లను సమర్పించే వరకు బీమా కంపెనీ క్లెయిమ్‌ను మంజూరు చేయదు. చాలా సార్లు, బీమా కంపెనీ కొన్ని వివరణలు , సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను కూడా అడుగుతుంది. మీరు మీ స్టేట్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటే, మీ దావా తిరస్కరించవచ్చు. అయితే FIR ఫైల్ చేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది.

Published on: Jan 22, 2024 07:09 PM