ఇంకా ఎన్నాళ్లు ఈ లేఆఫ్‌లు ?? సుందర్‌ పిచాయ్‌ సమాధానమిదే

|

May 13, 2024 | 8:50 PM

కొవిడ్‌ తర్వాత మొదలైన లేఆఫ్‌లు ఆ తర్వాత కూడా కొనసాగాయి. పలు సంస్థలు ఈ ఏడాది కూడా ఉద్యోగులను సాగనంపాయి. ప్రముఖ టెక్‌ కంపెనీ గూగుల్‌ (Google) కూడా గతేడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఇంకా తొలగిస్తూనే ఉంది. ఈ ఏడాది వందల సంఖ్యలో విడతలవారీగా తొలగింపులు చేపట్టింది. ఈనేపథ్యంలో లేఆఫ్‌లపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై ఉద్యోగులు నేరుగా సీఈఓ సుందర్‌ పిచాయ్‌నే ప్రశ్నించారు.

కొవిడ్‌ తర్వాత మొదలైన లేఆఫ్‌లు ఆ తర్వాత కూడా కొనసాగాయి. పలు సంస్థలు ఈ ఏడాది కూడా ఉద్యోగులను సాగనంపాయి. ప్రముఖ టెక్‌ కంపెనీ గూగుల్‌ (Google) కూడా గతేడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఇంకా తొలగిస్తూనే ఉంది. ఈ ఏడాది వందల సంఖ్యలో విడతలవారీగా తొలగింపులు చేపట్టింది. ఈనేపథ్యంలో లేఆఫ్‌లపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై ఉద్యోగులు నేరుగా సీఈఓ సుందర్‌ పిచాయ్‌నే ప్రశ్నించారు. ఇటీవల ఉద్యోగులతో నిర్వహించిన ఆల్‌హ్యాండ్స్‌ మీటింగ్‌లో పిచాయ్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో లేఆఫ్‌లపై ఓ ఉద్యోగి స్పందిస్తూ.. ఇంకా ఎన్నాళ్లు లేఆఫ్‌లు కొనసాగుతాయని పిచాయ్‌ను ప్రశ్నించారు. దీనికి పిచాయ్‌ స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితులను బట్టి..ఈ ఏడాది తొలి 6 నెలల పాటు ఈ లేఆఫ్‌లు కొనసాగుతాయని చెప్పారు. రెండో అర్ధభాగంలో కొద్ది సంఖ్యలో తొలగింపులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక కొత్త ఉద్యోగ నియామకాల విషయంలో గూగుల్‌ క్రమశిక్షణతో వ్యవహరించనుందని చెప్పారు. ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడం కంటే ఉన్న మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని వ్యవహరిస్తున్నట్లు ఉద్యోగులకు వివరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సమంత కంపెనీలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే

Suriya: రూ.1000 కోట్ల రాబడి సూర్య బిగ్ టార్గెట్

Ravi Teja: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రవితేజ..

Sai Pallavi: రూ.2 కోట్లు నష్టపోయిన సాయి పల్లవి

మామ, కోడలు సరదా రీల్స్.. నెట్టింట ఫుల్ వైరల్