Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా
ఇటీవల బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బులియన్ మార్కెట్ లో పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇటీవల బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. అక్టోబరు 28 మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.820 మేర ధర తగ్గింది. వెండి కేజీపై రూ.1000 తగ్గింది. గత పది రోజుల్లో రూ.8 వేలకు పైగా తగ్గిన పసిడి.. ఈరోజు కూడా నేలచూపులే చూసింది.
ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460 గా ఉంది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా కూడా గోల్డ్ రేటు తగ్గుతోందని.. బులియన్ నిపుణులు చెబుతున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో మంగళవారం నాడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,610 ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,350 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,460, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,250 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,280, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,13,000 గా కొనసాగుతోంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,22,460, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,12,250 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,22,460, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,12,250 గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,65,000 గా ఉంది. ఈ ధరలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు నమోదైనవి. ఇవి తరువాత పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అందుకే బంగారం కొనేటప్పుడు మరోసారి ధరలు చెక్ చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాత ముత్తాతల మూలాలేవి? 150 ఏళ్ల తర్వాత భారత్‌కు ఐదో తరం వ్యక్తి !! అచ్ఛం 7 తరాలు కథ లాంటి స్టోరీ
మయన్మార్‌లో సైబర్ మాఫియా దారుణాలు.. బయటపడ్డ 400 మంది భారతీయ బాధితులు
చైనా సముద్రంలో కూలిన అమెరికా విమానం
