Fly 91 Flights: ‘ఫ్లై91’ బంప‌రాఫ‌ర్‌.. రూ.1991కే హైద‌రాబాద్ టు గోవా..!

|

Mar 21, 2024 | 12:05 PM

'ఫ్లై91' అనే కొత్త దేశీయ విమాన‌యాన సంస్థ ఇటీవ‌ల గోవా కేంద్రంగా త‌న వాణిజ్య కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించింది. మార్చి 20న హైద‌రాబాద్ నుంచి గోవాకు 'ఫ్లై91' విమాన స‌ర్వీసును ప్రారంభించింది. ఈ విమాన స‌ర్వీస్ టికెట్ ధ‌ర అన్నీ చార్జీలు క‌లుపుకుని రూ. 1991 గా నిర్ణ‌యించింది. ఒక రోజు ముందు మార్చి 19న గోవా నుంచి బెంగ‌ళూరుకు మరో విమాన స‌ర్వీసును ప్రారంభించింది.

‘ఫ్లై91’ అనే కొత్త దేశీయ విమాన‌యాన సంస్థ ఇటీవ‌ల గోవా కేంద్రంగా త‌న వాణిజ్య కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించింది. మార్చి 20న హైద‌రాబాద్ నుంచి గోవాకు ‘ఫ్లై91’ విమాన స‌ర్వీసును ప్రారంభించింది. ఈ విమాన స‌ర్వీస్ టికెట్ ధ‌ర అన్నీ చార్జీలు క‌లుపుకుని రూ. 1991 గా నిర్ణ‌యించింది. ఒక రోజు ముందు మార్చి 19న గోవా నుంచి బెంగ‌ళూరుకు మరో విమాన స‌ర్వీసును ప్రారంభించింది. ఈ విమాన టికెట్ ధ‌ర కూడా రూ. 1991 మాత్ర‌మే. అలాగే బెంగ‌ళూరు నుంచి సింధుదుర్గ్‌కు కూడా విమాన స‌ర్వీసును ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. అంతేగాక హైదరాబాద్ నుంచి సింధుదుర్గ్‌, గోవాకు వారానికి రెండు విమాన స‌ర్వీసులు న‌డ‌ప‌నున్న‌ట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్, సీఈఓ మ‌నోజ్ చాకో వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం సోమ‌, శుక్ర‌, శ‌నివారాల్లో గోవా నుంచి బెంగ‌ళూరు మ‌ధ్య విమాన స‌ర్వీసులు నడుస్తున్నాయి. ఆ త‌ర్వాత ఏప్రిల్ నాటికి అగ‌ట్టి, జ‌ల్గావ్‌, పుణే వంటి న‌గ‌రాల‌కు విమాన స‌ర్వీసులు ప్రారంభిస్తామ‌ని సీఈఓ మ‌నోజ్ అన్నారు. అందరికీ విమానయాన సేవ‌లు అందుబాటులో ఉండాల‌నే ఉద్దేశంతోనే ఇలా త‌క్కువ ధ‌ర‌కు విమాన స‌ర్వీసులు న‌డిపిస్తున్న‌ట్లు సీఈఓ వెల్ల‌డించారు. దేశంలో ఇంత‌కుముందు ఎవ్వ‌రూ అమ‌లు చేయ‌ని త‌క్కువ ధ‌ర‌ల‌కు ప్ర‌యాణికుల‌ను వారి గ‌మ్య‌స్థానాల‌కు చేర్చ‌డానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని మ‌నోజ్ చాకో చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..