సినిమా హాళ్లు,అపార్ట్‌మెంట్లలోకి ఆధార్‌ ఉంటేనే ఎంట్రీ?త్వరలో కొత్త రూల్‌

Updated on: Nov 26, 2025 | 5:04 PM

కేంద్ర ప్రభుత్వం ఆధార్ వినియోగంలో కీలక మార్పులు తెస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు వంటి ప్రదేశాల్లో ప్రవేశానికి ఆధార్ త్వరలో తప్పనిసరి కావచ్చు. భద్రతను మెరుగుపరచడానికి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి UIDAI ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ కోసం కొత్త యాప్‌ను ప్రవేశపెట్టనుంది. దీనిలో కేవలం క్యూఆర్ కోడ్, ఫోటో మాత్రమే కనిపించి, వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడుతుంది. ఇది భవిష్యత్తులో విస్తృతంగా అమలయ్యే అవకాశం ఉంది.

ఆధార్ కార్డు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. భవిష్యత్తులో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆఫీసులు, అపార్ట్‌మెంట్లు వంటి ప్రదేశాల్లోకి ప్రవేశించాలంటే ఆధార్ తప్పనిసరి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రత దృష్ట్యా ఏవోక నిబంధనలు మార్చుతూ వెళ్తోంది. ఇక నుంచి మీరు ఏదైనా రెస్టారెంట్ లేదా హోటల్, అపార్ట్‌మెంట్‌కు వెళితే ఆధార్ యాక్సెస్ త్వరలో తప్పనిసరి కావొచ్చు. వెరిఫికేషన్ కోసం ఇప్పటికే చాలా ప్రదేశాల్లో ఆధార్ తప్పనిసరిగా చూపించాలనే నిబంధన ఉంది. త్వరలో రెస్టారెంట్లు లాంటి పబ్లిక్ ప్రదేశాల్లో కూడా ఆధార్‌ను తప్పనిసరి చేయనుంది. ఈ విధానాన్ని తెచ్చేందుకు UIDAI కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏదైనా పనికోసం ఆధార్ ఉపయోగించాలంటే ఆన్‌లైన్‌లో ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేసుకునే విధానం అందుబాటులో ఉంది. కానీ త్వరలో ఆఫ్‌లైన్ విధానంలో కూడా వెరిఫికేషన్ చేసే విధానం తీసుకురానుంది. దీని కోసం ఓ కొత్త యాప్‌ను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం ఉన్న విధానంలో చాలా ప్రదేశాల్లో తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ చూపించడంతో పాటు జిరాక్స్ కాపీని అందించాల్సి వస్తుంది. దీని వల్ల జిరాక్స్ కాపీని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. దీనిని అరికట్టేందుకు ఆఫ్‌లైన్ ఐడీ చెక్‌ను UIDAI ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త విధానంలో ఆధార్ వివరాలు ఏమీ కనిపించకుండా.. కేవలం క్యూఆర్ కోడ్, ఫొటో మాత్రమే ఉండేలా కొత్త యాప్ తీసుకురానుంది. ఇందుకోసం ‘ప్రూఫ్‌ ఆఫ్‌ ప్రజెన్స్‌’ అనే సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే సెక్యూరిటీ కోసం స్టేడియాలు, సినిమా హాళ్లు, ఆఫీసులు, ఆస్పత్రుల్లో కూడా ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టే అవకాశముంది. ఇలా జరిగితే ప్రతీఒక్కరూ తమ ఆధార్ కార్డును ఎల్లప్పుడూ తమ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్‌ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి

కూల్‌డ్రింక్‌పై ఇష్టంతో అతనేం చేశాడో చూడండి !!

వీళ్లు మామూలోళ్లు కాదు.. పోలీసులకే మస్కా కొట్టి జంప్‌

100 కోట్ల సంపాదనతో.. అత్యంత లగ్జరీగా బతికిన ఐ -బొమ్మ రవి

నల్లమలలో జంగిల్‌ సఫారీ.. ఎదురుగా పెద్దపులి.. కట్ చేస్తే