చెరొక బ్యాగుతో ఇబ్రహీంపట్నంలో తిరుగుతున్న అక్కాతమ్ముడు.. అనుమానం వచ్చి చెక్ చేయగా..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పది కిలోల గంజాయిని పట్టుకున్నారు ఆధిభట్ల పోలీసులు. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి ఆధిబట్ల పరిసర ప్రాంతాల్లో అమ్మడానికి యత్నిస్తున్న అక్కాతమ్ముడిని అరెస్ట్‌ చేశారు. 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన జోగి, కబాసిలు మల్కాన్‌గిరి తాలూకా గుర్లు గ్రామం నుంచి గంజాయి తెస్తున్నట్టు గుర్తించారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పది కిలోల గంజాయిని పట్టుకున్నారు ఆధిభట్ల పోలీసులు. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి ఆధిబట్ల పరిసర ప్రాంతాల్లో అమ్మడానికి యత్నిస్తున్న అక్కాతమ్ముడిని అరెస్ట్‌ చేశారు. 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన జోగి, కబాసిలు మల్కాన్‌గిరి తాలూకా గుర్లు గ్రామం నుంచి గంజాయి తెస్తున్నట్టు గుర్తించారు. నూకరాజు అనే వ్యక్తి దగ్గర గంజాయి కొని తెలంగాణకు తరలిస్తున్నారని చెబుతున్నారు పోలీసులు. ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూర్ దగ్గర 10 కిలోల గంజాయిని ఒక్కొక్కరు 5 కిలోల చొప్పున బ్యాగులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.