ఆమెను చూసి కొత్త డాక్టర్ వచ్చారేమో అనుకున్నారు.. కట్ చేస్తే.. దెబ్బకు అంతా షాక్
గుంటూరు జీజీహెచ్‌లో డాక్టర్ వేషంలో ఓ మహిళ హడావుడి చేసింది. తెల్లకోటు, స్టెతస్కోప్, నకిలీ ఐడీ కార్డుతో పిల్లల వార్డులో తిరిగింది జ్యోతి. ప్రతి రోగి దగ్గరికి వెళ్లి అందుతున్న చికిత్స గురించి ఆరా తీసింది. ఆరోగ్యం ఎలా ఉందంటూ పరామర్శించింది. రోగుల బంధువులు సైతం కొత్త డాక్టర్ ఎవరైనా వచ్చారేమో అంటూ అలా చూస్తుండిపోయారు.
గుంటూరు జీజీహెచ్‌లో డాక్టర్ వేషంలో ఓ మహిళ హడావుడి చేసింది. తెల్లకోటు, స్టెతస్కోప్, నకిలీ ఐడీ కార్డుతో పిల్లల వార్డులో తిరిగింది జ్యోతి. ప్రతి రోగి దగ్గరికి వెళ్లి అందుతున్న చికిత్స గురించి ఆరా తీసింది. ఆరోగ్యం ఎలా ఉందంటూ పరామర్శించింది. రోగుల బంధువులు సైతం కొత్త డాక్టర్ ఎవరైనా వచ్చారేమో అంటూ అలా చూస్తుండిపోయారు. ఇదంతా చూస్తున్న సిబ్బందికి అనుమానం వచ్చింది. జ్యోతిని నిలదీయడంతో తెల్లముఖం వేసింది. వెంటనే జీజీహెచ్ సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసులకు కూడా జ్యోతి పొంతనలేని సమాధానాలు చెబుతుండటం గమనార్హం.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

