బీట్‌రూట్‌తో ఇలా చేయండి.. మెరిసే చర్మం మీ సొంతం

|

May 24, 2024 | 9:28 PM

బీట్‌రూట్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా రక్త హీనతను తగ్గిస్తుంది. బీట్‌రూట్‌లో సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి ఎంతో మంచిది. బీట్‌రూట్‌ను ఫేస్‌ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మకాంతిని మెరిసేలా చేస్తుంది. సాధారణంగా మనం ముఖాన్ని అందంగా ఉంచుకోడానికి మార్కెట్‌లో దొరికే రకరకాల ప్రొడక్ట్‌లు వాడుతుంటాం. కానీ మన ఇంట్లోనే లభించే వాటితో నేచురల్‌గా మేనిఛాయను పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు.

బీట్‌రూట్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా రక్త హీనతను తగ్గిస్తుంది. బీట్‌రూట్‌లో సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి ఎంతో మంచిది. బీట్‌రూట్‌ను ఫేస్‌ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మకాంతిని మెరిసేలా చేస్తుంది. సాధారణంగా మనం ముఖాన్ని అందంగా ఉంచుకోడానికి మార్కెట్‌లో దొరికే రకరకాల ప్రొడక్ట్‌లు వాడుతుంటాం. కానీ మన ఇంట్లోనే లభించే వాటితో నేచురల్‌గా మేనిఛాయను పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. బీట్‌రూట్‌ను ఫేస్‌ప్యాక్‌గా ఉపయోగిస్తే చర్మం కాంతివంతమవుతుంది. దీనికోసం ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎండాకాలంలో చర్మం ఊరికే కమిలిపోతుంది. అలాంటప్పుడు బీట్‌రూట్‌-పెరుగుతో ప్యాక్‌ వేసుకుంటే టాన్ తొలగిపోతుంది. ఇందుకోసం ఓ గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా బీట్‌రూట్ జ్యూస్ కలపండి. దీనిని ముఖానికి అప్లై చేయండి. కాసేపయ్యాక క్లీన్ చేసుకోండి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మెరుగ్గా చేస్తుంది. అలాగే ఓ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బీట్‌రూట్ తురుము, రెండు టేబుల్‌ స్పూన్ల బియ్యంపిండి, కొద్దిగా చక్కెర, పెరుగు కలపండి. దీనిని ప్యాక్‌లా చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి సర్కిల్ మోషన్‌లో మసాజ్ చేయండి. పది నిమిషాలు అలానే ఉంచి నీటితో క్లీన్ చేసుకోండి. బీట్‌రూట్‌తో మరో అద్భుతమైన ప్యాక్‌.. ఓ టేబుల్ స్పూన్ పచ్చిపాలు, కొన్ని చుక్కల బాదం నూనె 2 టేబుల్ స్పూన్ల బీట్‌రూట్ జ్యూస్ కలపండి. దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలానే ఉంచి నీటితో క్లీన్ చేయండి. ఈ ప్యాక్ వాడితే స్కిన్ ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. బీట్‌రూట్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బీట్‌రూట్ ఫేస్ మాస్క్ చర్మాన్ని మెరిపిస్తుంది. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ముఖంపై డార్క్ స్పాట్స్, పిగ్మంటేషన్, సన్‌టాన్‌ని దూరం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. చర్మం కాంతివతంగా మారుతుంది. నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భర్త ఇచ్చిన గిఫ్ట్‌తో కోటీశ్వరురాలైన భార్య.. ఎలాగంటే ??

కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరివాడినయ్యా !! అసలు కథ ఏంటంటే ??

ఇల్లు, డబ్బు తీసుకుని తల్లిని గెంటేసిన కూతురు.. ఆ తర్వాత ఏం జరిగింది ??

ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో రిటైర్డ్ సైనిక శునకం ప్రయాణం

కేరళలో షాకింగ్ ఘ‌ట‌న‌ !! బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబాకు చిన్నారి బలి