ఖాళీ కడుపుతో బీట్ రూట్ జ్యూస్ తాగుతున్నారా? వీడియో
బీట్‌రూట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. శరీరానికి కీలక పోషకాలు, ఖనిజాలు అందించడంలో బీట్‌రూట్ మేటి. కానీ దీన్ని తినడానికి మాత్రం చాలామంది ఇష్టపడరు. మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే రక్తహీనత సమస్యను బీట్‌రూట్ తగ్గిస్తుంది. ముఖ్యంగా బీట్‌రూట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీనిని ఖాళీ కడుపుతో తాగడం అంత సురక్షితం కాదు.
ఖాళీ కడుపుతో బీట్‌రూట్ రసం తాగడం వల్ల కొంతమందిలో ఉబ్బరం, గ్యాస్, యాసిడిటీ రిఫ్లెక్షన్‌కు కారణం అవుతుంది. అకస్మాత్తుగా రక్తపోటు పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో తలతిరగడం లేదా బలహీనతకు దారితీస్తుంది. బీట్‌రూట్‌లో ఆక్సిలేట్లు ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవారికి హానికరం. ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. బీట్‌రూట్‌లో సహజ చక్కెర ఉంటుంది. ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల ఈ చక్కెర రక్తంలో త్వరగా కలిసిపోతుంది. దీని కారణంగా మధుమేహ రోగులు రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంది. భోజనం చేసిన ఒకటి నుంచి రెండు గంటల తర్వాత లేదా తేలికపాటి అల్పాహారంతో పాటు బీట్‌రూట్ రసం తాగడం మంచిదే. ఇందులో రుచికోసం క్యారెట్, ఆమ్లా, ఆపిల్ వంటి ఏదైనా కూరగాయలు లేదా పండ్ల రసాలు కూడా కలపవచ్చు. తద్వారా ప్రభావం సమతుల్యంగా ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్క లీటరు పాలు రూ. 5 లక్షలు.. ఏమిటా స్పెషాలిటీ వీడియో
కట్నం వద్దు.. వధువే ముద్దు..వీడియో
ఇబ్బందుల్లో నటి.. వన్య ప్రాణుల మాంసం రుచి చూడటం వల్ల వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
