Ba Ba Black Sheep: నవ్వుల వేట.. క్రైమ్ ట్విస్ట్! బా బా బ్లాక్ షీప్ రివ్యూ
క్రైమ్, కామెడీ, స్నేహం, మిస్టరీతో తెరకెక్కిన తెలుగు సినిమా ‘బా బా బ్లాక్ షీప్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్ తమ నటన, కామెడీతో ఆకట్టుకోగా, ఉపేంద్ర లిమాయె గ్యాంగ్‌స్టర్ పాత్రలో మెప్పించారు. మేఘాలయ అందాలు, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించినా, కథలోని మలుపులు, క్లైమాక్స్ ట్విస్టులు ఆసక్తిని పెంచుతాయి.
టైటిల్ చూస్తేనే ఏదో కొత్తగా ఉందనిపిస్తోంది కదా! ఓవైపు గ్యాంగ్‌స్టర్ గ్యాంగ్.. మరోవైపు పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీ చేసుకుంటున్న కుర్రాళ్లు.. వీళ్లందరినీ కలిపిన ఓ మిస్టరీ బాక్స్! దాని చుట్టూ జరిగే క్రైమ్, కామెడీ, ఛేజింగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే ‘బా బా బ్లాక్ షీప్’. మరి ఈ సినిమా నిజంగానే నవ్విస్తుందా? థ్రిల్ ఇస్తుందా? లేక రొటీన్ క్రైమ్ కామెడీగానే మిగిలిపోతుందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం! ముందుగా కథ విషయానికి వస్తే.. దేశంలో ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను దక్కించుకోవడానికి ఇద్దరు బడా వ్యాపారవేత్తలు పోటీపడుతుంటారు. ఈ క్రమంలో ఓ పెద్దాయనను ప్రసన్నం చేసుకోవడానికి స్వాతంత్ర్య కాలం నాటి ఓ అరుదైన వస్తువును సంపాదించాలని ప్రయత్నిస్తారు. ఆ బాధ్యత గ్యాంగ్‌స్టర్ జాన్ అలియాస్ మన ఉపేంద్రకు అప్పగిస్తారు.కట్ చేస్తే.. మేఘాలయలో పెళ్లికి రెడీఅయిన సత్తిపండు , తన ఫ్రెండ్ సందీప్‌తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంటాడు. అనుకోకుండా జరిగే ఓ ప్రమాదం వీళ్ల జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. ఆ ప్రమాదం కారణంగా గ్యాంగ్‌స్టర్ వెతుకుతున్న అరుదైన బాక్స్ సందీప్ అలియాస్ అక్షయ్ లగుసాని చేతికి వస్తుంది. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అసలైన ఆట! ఆ బాక్స్ కోసం గ్యాంగ్‌స్టర్ చేసే వేట.. స్నేహితుడిని కాపాడుకోవడానికి సందీప్ పడే తాపత్రయం.. ఈ ప్రయాణంలో ఎదురయ్యే పరిణామాలే సినిమా కథ. మరి కథనం ఎలా ఉంది? క్రైమ్‌తో పాటు కామెడీని కలిపి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనే దర్శకుడు గుణి మంచికంటి చేసిన ప్రయత్నం బాగుందనే చెప్పాలి. కథలోని మెయిన్ పాయింట్ మంచి ఆసక్తిని కలిగిస్తుంది. కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించినప్పటికీ, క్రైమ్ ట్రాక్‌తో పాటు కామెడీని నడిపించిన విధానం సినిమాకు ప్లస్ అవుతుంది. ముఖ్యంగా కథలోని మలుపులు, క్లైమాక్స్ ట్విస్టులు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ఇక నటీనటుల విషయానికొస్తే.. సందీప్ పాత్రలో అక్షయ్ లగుసాని ఎనర్జిటిక్‌గా కనిపించాడు. తన నటనతో పాటు డాన్సులతోనూ ఆకట్టుకున్నాడు. ఇక సత్తిపండు పాత్రలో విష్ణు ఓయ్ తన కామెడీ టైమింగ్‌తో సినిమాకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించాడు. అతడి డైలాగ్ డెలివరీ, నటన అక్కడక్కడా నవ్వులు పూయిస్తాయి. ‘యానిమల్’తో గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర లిమాయె.. గ్యాంగ్‌స్టర్ జాన్ పాత్రలో డిఫరెంట్ లుక్‌తో మెప్పించారు. యాజ్ యూజ్‌వల్ అదరగొట్టేస్తారు. ఇక విస్మయశ్రీ, రాజా రవీంద్ర, శుభలేఖ సుధాకర్, మాల్వీ మల్హోత్రా .. వీరందరూ కూడా తమ క్యారెక్టర్ తగ్గట్టుగా చాలా చక్కగా నటించారనే చెప్పాలి. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే.. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ మేఘాలయ అందాలు. అజయ్ అబ్రహం జార్జ్ సినిమాటోగ్రఫీ ప్రకృతి దృశ్యాలను తెరపై అందంగా ఆవిష్కరించాయి. ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు అవసరమైన మూడ్‌ను తీసుకొచ్చాయి. నిర్మాత వేణు దోనేపూడి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథాంశాన్ని తెరపైకి తీసుకురావడంలో నిర్మాణ పరంగా ఈయన బెస్ట్ ఇచ్చారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. పూర్తిగా మేఘాలయలో చిత్రీకరించిన తొలి దక్షిణాది సినిమా ఇదే కావడం.. మరో ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే అందమైన మేఘాలయ లొకేషన్లతో విజువల్‌గా సినిమా అదిరిపోతుంది. ఇక మొత్తానికి ‘బా బా బ్లాక్ షీప్’ ఎలా ఉందంటే.. క్రైమ్, కామెడీ, ఫ్రెండ్‌షిప్, ట్విస్టులు.. ఇలా అన్నింటినీ కలిపి ఓ ఎంటర్‌టైనర్ అయితే డెలివరీ చేశారు గుణి మంచికంటి అండ్ వేణు దోనూపూడి. కథలో కొన్ని పరిచయమైన అంశాలు ఉన్నప్పటికీ, నటీనటుల కామెడీ, మేఘాలయ అందాలు, క్లైమాక్స్ మలుపులు సినిమాకు మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. క్రైమ్ కామెడీ సినిమాలను ఇష్టపడేవారు, కొత్త లొకేషన్లలో సాగే కథలను చూడాలనుకునేవారు ఈ సినిమా వైపు ఓ లుక్కేయొచ్చు. ఇదీ ‘బా బా బ్లాక్ షీప్’ మూవీ రివ్యూ. ఇప్పటికే ఈ సినిమా మీరు చూసుంటే.. మీకెలా అనిపించిందో.. కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈఎంఐలు కట్టేవారికి అలర్ట్.. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయ్!
మీ ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉన్నాయా.. మీ కరెంట్ బిల్లు పేలిపోద్ది జాగ్రత్త!
Yash: యశ్‌కు OTT సంస్థ బిగ్ పంచ్.. హిట్టు అవ్వకుంటే.. పైకం పడిపోయినట్టే!
Trivikram: తడబడుతున్న త్రివిక్రమ్‌ను చూసి టెన్షన్ పడుతున్న NTR ఫ్యాన్స్
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

