Massive Spider Web: అవి తెరలా.. సాలీడు గూళ్ళ… చెట్టు..పుట్ట అన్నీ సాలెపురుగుల గూటి కిందే.. ( వీడియో )

సాలెపురుగు పెట్టె గూడు ఇంట్లో ఎక్కడో ఒక మూల చూస్తేనే అదోలా అనిపిస్తుంది. పాడుపడిన భవంతుల ప్రాంతంలో దట్టంగా ఉండే సాలె గూళ్ళను చూస్తే చికాకు పుడుతుంది.

|

Updated on: Jun 20, 2021 | 11:26 AM

సాలెపురుగు పెట్టె గూడు ఇంట్లో ఎక్కడో ఒక మూల చూస్తేనే అదోలా అనిపిస్తుంది. పాడుపడిన భవంతుల ప్రాంతంలో దట్టంగా ఉండే సాలె గూళ్ళను చూస్తే చికాకు పుడుతుంది. అటువంటిది ఎనిమిది కిలోమీటర్ల ప్రాంతంలో మొత్తం సాలెపురుగుల గూళ్ళు అల్లుకుపోతే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇటువంటి బీభత్సమే ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా లోని ఆగ్నేయ రాష్ట్రమైన విక్టోరియాలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఆ తరువాత అక్కడి పరిస్థితి విచిత్రంగా మారిపోయింది. లక్షలాది సాలెపురుగులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించేశాయి. రోడ్లు.. చెట్లు.. సైన్ బోర్డులు ఇలా మొత్తం ఆ ప్రాంతం పై ఓ పెద్ద గూడును అల్లేశాయి. భారీ ”గోసమార్” షీట్లను సృష్టించాయి. రాష్ట్రంలోని గిప్స్‌ల్యాండ్ ప్రాంతంలో, తీవ్రమైన వర్షపాతం ఉన్న రోజులు “బెలూనింగ్” అని పిలువబడే మనుగడ వ్యూహాన్ని ఉపయోగించి సాలెపురుగులు భూమిపైకి వెళ్ళే ప్రయత్నంలో ఇలా చేశాయి. లక్షలాది సాలీళ్ళు ఒకేసారి తమ గూడును అల్లే పట్టును వదలడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Kiara Advani:: బాలీవుడ్ బ్యూటీ కియారాకు రూ.3 కోట్లు రెమ్యునరేషన్..?? ( వీడియో )

Earth Heat: ధరణికి మరో పెను ముప్పు… అధిక ఉష్ణోగ్రతలతో వేడెక్కి పోతున్న భూగోళం.. ( వీడియో )

Follow us