Crime: కన్న తండ్రి కర్కశత్వానికి బాలుడు బలి.. పసివాడు చేసిన పాపమేంటి..?

Updated on: Sep 01, 2023 | 10:00 PM

అన్యం పుణ్యం ఎరుగని పసి వయసు.. లోకాన్ని సరిగ్గా చూడని ఆ బాలుడిని కన్న తండ్రి కర్కోటకానికి బలయ్యాడు. అల్లారు ముద్దుగా పెరిగిన పదేళ్ళు పిల్లాడిని అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపాడో కన్న తండ్రి. గుండెలు తరుక్కుపోయే ఈ సంఘటన కడప జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. కమలాపురం మండలపరిధిలోని అగస్త్య లింగాయపల్లి గ్రామంలో సోమేశ్వర రెడ్డి అనే పదేళ్ళ బాలుని కన్న తండ్రి శివశంకర్ రెడ్డి గొంతు కోసి హత్య చేశాడు.

అన్యం పుణ్యం ఎరుగని పసి వయసు.. లోకాన్ని సరిగ్గా చూడని ఆ బాలుడిని కన్న తండ్రి కర్కోటకానికి బలయ్యాడు. అల్లారు ముద్దుగా పెరిగిన పదేళ్ళు పిల్లాడిని అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపాడో కన్న తండ్రి. గుండెలు తరుక్కుపోయే ఈ సంఘటన కడప జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. కమలాపురం మండలపరిధిలోని అగస్త్య లింగాయపల్లి గ్రామంలో సోమేశ్వర రెడ్డి అనే పదేళ్ళ బాలుని కన్న తండ్రి శివశంకర్ రెడ్డి గొంతు కోసి హత్య చేశాడు. తెల్లవారుజామున ఇంటి ఆవరణంలో నిద్రపోతున్న కొడుకును కత్తితో గొంతు కోసి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా.. అప్పటికే సోమేశ్వర రెడ్డి మృతి చెందాడు. ముక్కుపచ్చలారని ఆ పసివాడి మరణంతో ఆ గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..